calender_icon.png 9 September, 2025 | 10:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మత్తు పదార్థాలకు అడ్డాగా మేడ్చల్ జిల్లా

08-09-2025 12:00:00 AM

  1. డ్రగ్స్ తయారీ ఇక్కడే 
  2. జిల్లాలో తయారైన డ్రగ్స్ ఇతర రాష్ట్రాలకు సరఫరా 
  3. నిద్దరోతున్న నిఘా వ్యవస్థలు
  4. పరిశ్రమల అధికారుల నిర్లక్ష్య ధోరణి 
  5. విచ్చలవిడిగా గంజాయి, డ్రగ్స్ వినియోగం 

మేడ్చల్, సెప్టెంబర్ 7 (విజయక్రాంతి): మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మత్తు పదార్థాలకు అడ్డగా మారింది. జిల్లాలో మత్తు పదార్థాల వినియోగం ఎక్కువగా ఉండగా, తాజాగా తయారి కూడా ఇక్కడే జరుగుతుందని వెల్లడి కావడం ఆందోళన కలిగిస్తోంది. చర్లపల్లి ఐదవ ఫేసులో వాగ్దేవి లాబొరేటరీస్ లో రూ.11.58 కోట్ల డ్రగ్స్ ముడి సరుకును ముంబై పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

మెడిసిన్ తయారీ పేరుతో డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అనుమతి తీసుకుని డ్రగ్స్ తయారు చేస్తున్నారు. రూ. 12 వేల కోట్ల రూపాయల విలువ చేసే డ్రగ్స్ తయారు చేసే రా మెటీరియల్ను పట్టుకున్నారు. ప్రధా న నిందితుడు శ్రీనివాసు విజయ్ ఓలేటి, అతని అనుచరుడు తానాజీ పండరినాథ్ పట్వారి సహా 13 మందిని మహారాష్ట్ర పోలీసులు అరెస్టు చేశారు.

మెఫీ డ్రోన్ అనే డ్రగ్ ను స్వాధీనం చేసుకున్నారు. ఇంత పెద్ద మొత్తంలో జిల్లాలో పట్టుపడడం గమనార్హం. మహారాష్ట్రకు చెందిన మీరా భయం దర్, వసయ్ విరార్ పోలీసుల ఆపరేషన్ తో తెలంగాణ పోలీసులు, నార్కోటిక్, ఈగల్, పరిశ్రమల శాఖ అధికారుల నిర్లక్ష్యం బయటపడింది. 

రసాయన పరిశ్రమలలో తయారీ..

డ్రగ్స్ గోవా నుంచి తీసుకువచ్చి విక్రయిస్తుండగా పట్టుబడిన సందర్భాలు ఉన్నాయి. నైజీరియా నుంచి వచ్చి ఇక్కడ డ్రగ్స్ విక్రయిస్తూ పలువురు పట్టుబడ్డారు. కానీ తాజాగా డ్రగ్స్ ను ఇక్కడే తయారు చేస్తూ దేశంలోని వివిధ ప్రాంతాలకు సరఫరా చేస్తుండడం విస్మయం కలిగిస్తోంది. అంతేగాక ఈ ముఠాకు అంతర్జాతీయ ముఠాతో సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోంది. జిల్లాలోని పారిశ్రామిక వాడలలో రసాయన పరిశ్రమలలో డ్రగ్స్ తయారవుతోంది.

రసాయన నిపుణులు డ్రగ్స్ తయారీ విధానం తెలుసుకొని తయారు చేస్తున్నారు. చర్లపల్లి లోనే కాకుండా గతంలోనూ పలువురు డ్రగ్స్ తయారు చేస్తూ పట్టుబడిన సందర్భాలు ఉన్నాయి. ఎనిమిది నెలల క్రితం మేడ్చల్ పోలీసులు, నార్కోటిక్ సిబ్బంది జాయింట్ ఆపరేషన్ చేసి డ్రగ్స్ తయారు చేస్తున్న అల్లు సత్యనారాయణ అనే వ్యక్తిని మేడ్చల్ లో అరెస్టు చేశారు.

ఈయన యాదాద్రి భువనగిరి జిల్లా లోని ఒక పరిశ్రమలో డ్రగ్స్ తయారు చేస్తూ విక్రయిస్తు న్నట్లు తేలింది. ఈయనతో పాటు మరో ఏడుగురిపై కేసు నమోదు అయింది. సత్యనారాయణ వద్ద ఒక కిలో మేపే డ్రోన్ స్వాధీ నం చేసుకున్నారు. 2023 డిసెంబర్లో సూరారంలో డ్రగ్స్ తయారు చేస్తున్న ముగ్గురిని అరెస్టు చేశారు. కమ్మ శ్రీనివాస్ అనే వ్యక్తి ఓ కంపెనీలో పనిచేసేవాడు. మణికంఠ, నరసింహ రాజుతో కలిసి డ్రగ్స్ తయారు చేస్తుండగా పోలీసులు పట్టుకున్నారు.

పరిశ్రమల అధికారుల నిర్లక్ష్యం.. 

పరిశ్రమలను సంబంధిత అధికారులు తరచూ తనిఖీ చేయాలి. ఏ ఉత్పత్తుల కోసం అనుమతి తీసుకున్నారో, ఏమీ ఉత్పత్తి చేస్తున్నారో అనేది పరిశీలించాలి. అంతేగాక కార్మి కుల భద్రతకు చర్యలు తీసుకుంటున్నారా? అగ్నిమాపక వ్యవస్థ ఉందా? అనేది పరిశీలించాలి. కానీ అధికారులు ఇవేమీ చూ డ డం లేదు. కంపెనీల నుంచి మామూళ్ళు తీ సుకొని అన్ని సక్రమంగా ఉన్నాయని రిపో ర్టు ఇస్తున్నారు.

అధికారులు తనిఖీ చేస్తే డ్రగ్స్ తయారీ గుట్టు రట్టయ్యేది. నాలుగేళ్లుగా డ్రగ్స్ తయారు చేస్తున్న సంబంధిత అధికారులు గుర్తించలేకపోయారు. మహారాష్ట్ర పోలీసులు ఆపరేషన్ చేసి డ్రగ్స్ తయా రీ బహిర్గతం చేస్తే కానీ తెలియలేదు. నార్కోటిక్ స్థానిక పోలీసుల వైఫల్యం బహిర్గతమైంది 

విచ్చలవిడిగా వినియోగం..

డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్థాల వినియోగం ఎక్కువగా ఉంది. ఇటీవల మహేంద్ర యూనివర్సిటీ, మెడిసిటీ మెడికల్ కాలేజీ విద్యార్థులకు పాజిటివ్ వచ్చిన విషయం తెలిసిందే. గంజాయి విక్రయాలు విచ్చలవిడిగా సాగుతున్నాయి. ఇప్పటికైనా జిల్లాలో మత్తుపదార్థాల విక్రయాలు, తయా  రీ అరికట్టాలని స్థానికులు కోరుతున్నారు.