16 May, 2026 | 6:29 PM

సుధీర్‌బాబు హీరోగా ‘జటాధర’ ప్రారంభం

15-02-2025 10:33 PM

ప్రముఖ నిర్మాణ సంస్థ జీ స్టూడియోస్ సమర్పణలో ఉమేశ్ కేఆర్ బన్సాల్,  ప్రేరణ అరోరా నిర్మాతలుగా సుధీర్‌బాబు హీరోగా సూపర్ నేచురల్ మైథలాజికల్ థ్రిల్లర్ ‘జటాధర’ చిత్రం తెరకెక్కుతోంది. ఈ మూవీ పూజా కార్యక్రమాలు హైదరాబాద్‌లో శనివారం జరిగాయి. ఈ కార్యక్రమానికి దర్శకుడు హరీశ్ శంకర్, మైత్రి మూవీ మేకర్స్ నిర్మాత రవిశంకర్, దర్శకుడు వెంకీ అట్లూరి, దర్శకుడు మోహన ఇంద్రగంటి, శిల్పా శిరోధ్కర్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ సందర్భంగా జీ స్టూడియోస్ సీఈవో ఉమేశ్ కేఆర్ బన్సాల్ మాట్లాడుతూ.. ‘జీ స్టూడియోస్‌లో రూపొందుతున్న జటాధర థ్రిల్లింగ్ సూపర్ నేచురల్‌గా ఉండబోతోంది. ఈ ప్రాజెక్ట్ కోసం మరోసారి ప్రేరణ అరోరాతో కలిసి పని చేయడం ఆనందంగా ఉంది. ప్రేక్షకులకు ఓ అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్‌ని అందించే సినిమా ఇది’ అన్నారు.

జటాధర సినిమా కథ అనంత పద్మనాభ స్వామి ఆలయం చుట్టూ తిరుగుతుంది. అక్కడి సంపద, దాని చుట్టూ అల్లుకున్న వివాదాలు, నేపథ్యం, చరిత్ర ఇలా అనేక అంశాలను ఈ చిత్రంలో చూపించనున్నారు. అక్కడి నిధిని మాత్రమే కాకుండా ఆలయ చరిత్ర, పురాణా కథల్ని కూడా చూపించబోతున్నారు. ఈ సినిమాలో సుధీర్‌బాబు క్యారెక్టర్ చాలా భిన్నంగా ఉండబోతోంది. ‘జటాధర’ యాక్షన్-ప్యాక్డ్ ఎంటర్‌టైనర్‌గా ఆడియెన్స్ ముందుకు రానుంది. థ్రిల్లింగ్, మిస్టరీ అంశాలతో ‘జటాధరా’ను ఉత్కంఠభరితంగా ఉండేలా తెరకెక్కిస్తున్నారు. ‘జటాధర’లో నిధి కోసం పోరాటం జరుగుతుంది.. కానీ పోరాడాలంటే కొన్ని శాపాల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆ పోరాటం ఏంటి? ఈ శాపం ఏంటి? అని తెలియాలంటే ఇంకొన్ని నెలలు వేచి చూడాల్సిందే.