జాబిలమ్మ నీకు అంత కోపమా కొత్త ప్రేమకథ
పా పాండి, రాయన్ వంటి బ్లాక్ బస్టర్‌ల తర్వాత ధనుష్ ‘జాబిలమ్మ నీకు అంత కోపమా’ అంటూ దర్శకుడిగా మరోసారి అందరినీ మెప్పించేందుకు సిద్ధమయ్యారు. ధనుష్ హోమ్ బ్యానర్ వండర్‌బార్ ఫిల్మ్స్, ఆర్‌కే ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 21న విడుదల చేయనున్నారు.
తెలుగులో ఈ మూవీని ఏషియన్ సురేశ్ ఎంటర్‌టైన్‌మెంట్ ఎల్‌ఎల్‌పీ విడుదల చేస్తోంది. ఈ క్రమంలో చిత్ర యూనిట్ శనివారం హైదరాబాద్‌లో ప్రెస్‌మీట్ నిర్వహించింది. ఈ సమావేశంలో అనికా సురేంద్రన్, వెంకటేశ్ మీనన్ మాట్లాడుతూ.. ‘మా చిత్రం ఫిబ్రవరి 21న రాబోతోంది. అందరూ మా సినిమాను చూసి సపోర్ట్ చేయండి’ అన్నారు. రబియా మాట్లాడుతూ.. ‘ఈ చిత్రంతోనే నేను ఇండస్ట్రీలోకి అడుగు పెడుతున్నా.
సినిమాను ఎంతో ఎంజాయ్ చేస్తూ చేశాం. మేం అందరం కొత్త వాళ్లమే. ఈ సినిమాను అందరూ ఆదరించండి’ అన్నారు. ‘ఈ మూవీతోనే నేను వెండితెరకు పరిచయం కాబోతున్నాను. ఈ సినిమా ప్రమోషన్స్‌కు హైదరాబాద్ రావడం ఆనందంగా ఉంది’ అని రమ్య రంగనాథన్ చెప్పారు.
ఏషియన్ సురేశ్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రతినిధి జాన్వీ నారంగ్ మాట్లాడుతూ.. ‘మేం ఓ కొత్త లవ్ స్టోరీతో రాబోతున్నాం. ఈ సినిమాను తెలుగులో రిలీజ్ చేసే అవకాశాన్ని ఇచ్చిన ధనుష్‌కు థాంక్స్. ఈ చిత్రం అందరినీ అలరిస్తుందని నమ్ముతున్నా’ అని తెలిపారు.






