9 May, 2026 | 2:17 PM

Breaking News

మాటల ప్రభుత్వం కాదు.. మాది చేతల ప్రభుత్వం   •   అకాల వర్షానికి తడిసిన ధాన్యాన్ని పరిశీలించిన బిజెపి నాయకులు తంబళ్ల రవి   •   తమిళనాడులో రాజకీయ సంక్షోభం.. హైదరాబాద్‌కు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు   •   నిర్బంధ రాజకీయాలకు ముగింపు పలకాలి   •   కాంగ్రెస్ నాయకత్వ చర్చల నడుమ — కేరళ సీఎంపై కొనసాగుతున్న ఉత్కంఠ   •   గోలేటి స్పోర్ట్స్ లయన్స్ క్లబ్ అధ్యక్షుడిగా దీకొండ సంజీవ్‌కుమార్   •   ఇంటి పనోళ్ల వివరాలు పోలీస్ స్టేషన్‌లో నమోదు చేయాలి   •   ఐపీఎస్ అధికారి భార్య హత్యకేసులో విచారణ వేగవంతం. రంగంలోకి 10 ప్రత్యేక పోలీసు బృందాలు   •   బెంగాల్‌ సీఎంగా సువేందు అధికారి ప్రమాణస్వీకారం   •   “Back to Question”: సంగారెడ్డి జైలు నుంచి మన్నె క్రిశాంక్ విడుదల   •  

షాపింగ్ కాంప్లెక్స్ సమస్యలు పరిష్కరించాలి

25-04-2024 02:17 AM

మంత్రి శ్రీధర్‌బాబుకు వినతి

మంథని, ఏప్రిల్ 24 (విజయక్రాంతి): రామగిరి మండలం సెంటినరీకాలనీలోని వ్యాపార సముదాయాల ఎత్తు పెంచుకునేందుకు అవకాశం కల్పించాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు బుధవారం యాజమానులు కోరారు. మంథని ప్రధాన రహదారి విస్తరణ పనుల నేపథ్యంలో షాపులు కిందికి అవుతున్నాయని, దుకాణాల ఎత్తు పెంచేందుకు అవకాశం కల్పించాలని, అలాగే షాపు లకు విద్యుత్ లైన్లు అడ్డురాకుండా చూడాలని కోరారు. వెంటనే స్పందించి సింగరేణి ఆర్జీ జీఎం సుధాకర్‌రావుకు కాల్ చేశా రు. షాపు యజమానుల సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని సూచించారు. దీంతో మంత్రికి వ్యాపారులు కృతజ్ఞతలు తెలిపారు. మంత్రి వెంట కాంగ్రెస్ పార్టీ మంథని బ్లాక్ అధ్యక్షుడు తొట్ల తిరుపతి యాదవ్, నాయకులు రొడ్డ బాబు, వనం రాంచందర్‌రావు, గంట వెంకటరమణారెడ్డి, చంద్రయ్య, శ్రీనివాస్, సదానందం ఉన్నారు.