15 July, 2026 | 2:34 PM

Breaking News

సోనాల మండల కేంద్రంలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేయండి   •   ఫ్యూచర్ సిటీలో అమెజాన్ డేటా సెంటర్   •   లవ్ మ్యాటర్ ఇంట్లో తెలుస్తుందనే భయం.. KGBVలో విద్యార్థిని ఆత్మహత్యాయత్నం   •   ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలి   •   ఫీజుల నియంత్రణ చట్టం అమలు చేయాలి   •   గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో ఇద్దరు యువకుల మృతి   •   ప్రతి ఇంటా ఇంకుడు గుంత నిర్మించుకోవాలి: మున్సిపల్ చైర్‌పర్సన్ పిలుపు   •   బోధన్ పట్టణంలో జగన్నాధ రధయాత్రకు ఏర్పాట్లు పూర్తి   •   గీతంలో ఇండస్ట్రియల్ ఫార్మసీ   •   ఢిల్లీకి బీఆర్ఎస్ పార్టీ బృందం.. కేంద్రమంత్రితో కేటీఆర్ ప్రత్యేక భేటీ   •  

హిండెన్ బర్గ్ రిపోర్ట్ భస్మాసుర హస్తమా ?

22-08-2024 12:41 PM

ముంబయి: ఈ సారి హిండెన్ బర్గ్ రిపోర్ట్ 2024లో ఎవరిని టార్గెట్ చేసిందో... ఎవరి నెత్తిమీద చెయ్యి పెట్టాలని ప్లాన్ వేసిందో?.. కానీ.. ఆశించిన మేరకు లక్ష్యం సాధించ లేదంటున్నారు. కాంగ్రెస్ పార్టీ  దేశ వ్యాప్త ధర్నా చేపట్టిన నేపథ్యంలో అసలు హిండెన్ బర్గ్ రిపోర్ట్ పై భిన్న కథనాలు వినిపిస్తున్నాయి. షార్ట్ సెల్లర్ హిండెన్ బర్గ్ 2023 లో రిపోర్ట్ ను బాణంలా ఎక్కు పెట్టాడు.అదానీ షేర్లపై నెగిటివ్ న్యూస్ ప్రచారం చెయ్యడంతో షేర్ల ధరలు అథ: పాతాళానికి పడి పోయాయి. అప్పుడు పెద్ద ఎత్తున భారీ సంఖ్యలో షేర్లను బై బ్యాక్ చేశారు. ఆవిధంగా ఒక బిలియన్ డాలర్లమేరకు సొమ్ము చేసుకున్నారని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. 

ఈ సారి అదానీ తాలూకు షెల్ కంపెనీలలో పెట్టు బడి పెట్టిన వారు ఏకంగా సెబీ చీఫ్ మాధబీ పూరీ బచ్, దంపతుల ప్రమేయం వుందంటూ  హిండెన్ బర్గ్ రిపోర్ట్ బాంబు లాంటి సమాచారం మార్కెట్ల పై వదిలేసింది. కానీ 2024 రిపోర్ట్ ఊహించిన స్థాయిలో మార్కెట్లను కుదిపి వేయలేక పోయిందని  దానికి సెబీ తీసుకున్న మార్కెట్ రెగ్యులేటరీ  చర్యలే కారణమని విశ్లేషిస్తున్నారు. కాగా ఈ మొత్తం హిండెన్ బర్గ్ రిపోర్ట్ వెనుక జార్జ్ సోరోస్ అనే బిలియనీర్ తెర వెనుక పని చేస్తున్నారనని  మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఈ మేరకు హిండెన్ బర్గ్ రిపోర్ట్ ను భస్మాసుర హస్తంగా వారిపైకే బ్యాక్ ఫైర్ అయిన తుపాకీ గుండు గా మార్కెట్ పండితులు అభివర్ణిస్తున్నారు. కాగా అదానీ మోదీల మధ్య  ఉన్న క్రోనీ కేపిటలిజం లాంటి అవగాహన ఉన్నట్లుగా  కాంగ్రెస్ పార్టీ నాయకుడు జైరామ్ రమేష్ ఆరోపించారు. అందుకే ధర్నకు పిలుపిచ్చామని ఆయన తెలిపారు.