22 May, 2026 | 7:06 AM

సీఎం రేవంత్ రెడ్డితో మంద కృష్ణ మాదిగ భేటీ

22-08-2024 12:31 PM

హైదరాబాద్: మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎమ్మార్పీఎస్) వ్యవస్థాపకుడు మంద కృష్ణ మాదిగ, ఇతర నేతలు గురువారం జూబ్లీహిల్స్‌లోని ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో కలిశారు. రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేసేలా చూడాలని కృష్ణ మాదిగ, ఇతర నేతలు రేవంత్ రెడ్డిని కోరారు. ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నరసింహ, ప్రభుత్వ విప్‌ లక్ష్మణ్‌, ఇతర నాయకులు పాల్గొన్నారు.