calender_icon.png 6 February, 2026 | 7:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రిజర్వేషన్లు అడ్డుకున్న నేతకు టికెట్టా?

06-02-2026 12:36:39 AM

  1. మాధవరెడ్డిని చేర్చుకుని బీఆర్‌ఎస్ బీసీలకు ద్రోహం తలపెట్టింది
  2. బీసీ సమాజానికి క్షమాపణ చెప్పాలి 
  3.   48 గంటల్లో వివరణ ఇవ్వకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆ పార్టీ ఆఫీస్‌ల వద్ద ధర్నాలు చేస్తాం 
  4. బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ 

హైదరాబాద్/పంజాగుట్ట, ఫిబ్రవరి 5(విజయక్రాంతి): బీసీ సమాజం సుదీర్ఘకాలంగా పోరాడి సాధించుకున్న 42 శాతం బీసీ రిజర్వేషన్లను అమలు జరగకుండా నిలువునా అడ్డుకున్న రెడ్డి జాగృతి నాయకుడు బుట్టెంగారి మాధవరెడ్డి మొన్నటితో ముసుగు తొలగిందని, బీసీ రిజర్వేషన్లను అడ్డుకున్నందుకు ప్రతిఫలంగా బీఆర్‌ఎస్ పార్టీ మేడ్చల్ నియోజకవర్గం మూడు చింతల పల్లి మున్సిపాలిటీ పరిధిలోని కేశవాపూర్ పదవ వార్డు కౌన్సిలర్ గా టికెట్ ఇచ్చిందని బీసీ జేఏసీ రాష్ట్ర చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ మండిపడ్డారు.

గురువారం హైదరాబాద్‌లోని సోమాజి గూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీసీ జేఏసీ నేతలతో కలిసి ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు విద్యా ఉద్యోగ రాజకీయ రంగాల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టి చట్టం తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్ల అమలు కోసం జీవో తొమ్మి ది విడుదల చేసిందని అన్నారు.

ఈ జీవోతో బీసీలకు 42 శాతం సర్పంచ్‌లు, కౌన్సిలర్లు, కార్పొరే టర్లు, మున్సిపల్ చైర్మన్లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, జెడ్పీ చైర్మన్ స్థానాలు దక్కుతాయని రాష్ట్రవ్యాప్తంగా బీసీలు ఎంతో సంబరపడ్డారని అన్నా రు. కానీ బీసీల ఆశలను అడియాసలు చేస్తూ బీసీ రిజర్వేషన్ల వ్యతిరేకి రెడ్డి జాగృతికి చెందిన బుట్టెం గారి మాధవరెడ్డి అనే వ్యక్తి రాత్రికి రాత్రి హైకోర్టు సుప్రీంకోర్టుల ద్వారా బీసీ రిజర్వేషన్లు అడ్డుకొని 42 శాతం రిజర్వేషన్ల జీవోను రద్దు చేయించారని అని తెలిపారు.

60 శాతం జనాభా ఉన్న బీసీల నోట్లో మట్టి కొట్టి తినే కంచంలో మన్ను పోసిన మాధవరెడ్డి వెనుక ఏ శక్తి ఉందో తేలాలని రాష్ట్రవ్యాప్తంగా బీసీ సమాజం రోడ్లెక్కిందని చివరికి రాష్ట్ర బంధు జరిపి ఉద్యమాన్ని ఉధృతం చేసిందని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ఇలాంటి సందర్భంలో బుట్టం గారి మాధవరెడ్డి ముసుగు తొలగిందని కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు ఆదేశాలతో మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి మాధవరెడ్డికి గులాబీ కండువా కప్పి బీసీ రిజర్వేషన్లు అడ్డుకున్నందుకు బహుమానంగా బీఆర్‌ఎస్ పార్టీ తరపున కౌన్సిలర్‌గా పోటీ చేయడానికి బీ ఫామ్ ఇచ్చారని ఈ సందర్భంగా జాజుల శ్రీనివాస్ గౌడ్ మీడియాకు ఆధారాలు చూపించారు.

ఇన్ని రోజులు తాము బీసీ రిజర్వేషన్లకు మద్దతు అంటూ నమ్మబలికిన బీఆర్‌ఎస్ బీసీల ద్రోహిని తమ పార్టీలోకి చేర్చుకుని బీసీ సమాజానికి తాము బీసీలకు వ్యతిరేకం అని సందేశం ఇచ్చిందని ఆయన తెలిపారు.బీఆర్‌ఎస్ పెద్దలు కేసీఆర్, కేటీఆర్,హరీశ్‌రావులకు తెలవకుండా బుట్టెం గారి మాధవరెడ్డిని మాజీ మంత్రి మల్లారెడ్డి గులాబీ కండువా కప్పడని అన్నారు.

ఒకవేళ వారికి తెలవకుండా పార్టీలోకి చేర్చుకుంటే బీసీలపై ఏమాత్రం బీఆర్‌ఎస్‌కు చిత్తశుద్ధి ఉన్న మాధవరెడ్డిని 48 గంటల్లోగా ఆ పార్టీ నుంచి బహిష్కరించాలని లేదంటే బీసీ రిజర్వేషన్లను మాధవరెడ్డి ద్వారా అడ్డుకున్నది బీఆర్‌ఎస్ పార్టీఅని, నేనని దమ్ముం టే బహిరంగంగా వెల్లడించాలని ఆయన సవాల్ విసిరారు.

బీఆర్‌ఎస్ పార్టీలో ఉన్న బీసీ నేతలు ఇప్పటికైనా గ్రహించి కేసీఆర్, కేటీఆర్‌లపై ఒత్తిడి పెంచి మాధవరెడ్డి లాంటి బీసీ ద్రోహులను బీఆర్‌ఎస్ పార్టీకి దూరంగా పెట్టాలని, జాజుల శ్రీని వాస్‌గౌడ్ నేర్కొన్నారు. లేకుంటే బీఆర్‌ఎస్ పార్టీలో ఉన్న బీసీ నేతలు కూడా మాధవ రెడ్డికి మద్దతు ఇచ్చిన వాళ్లే అవుతారని ఆయన హెచ్చరించారు.