15 April, 2026 | 3:16 AM

సీబీఐకి ఇవ్వాలి

25-06-2025 01:03 AM

నా ఫోన్ కూడా ట్యాప్ అయింది: ఎంపీ డీకే అరుణ

మహబూబ్‌నగ ర్, జూన్ 24 (విజ యక్రాంతి): గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హ యాంలో తన ఫోన్ కూడా ట్యాప్ చేశారని మహబూబ్‌న గర్ బీజేపీ ఎంపీ డీకే అరుణ ఆరోపించారు. ఎంపీగా ప్రమాణస్వీకారం చేసి ఏడాది పాలన పూర్తి చేసిన సందర్భం గా మంగళవారం జిల్లా కేంద్రంలోని తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. బీఆ ర్‌ఎస్ హయాంలో ఫోన్లు ట్యాప్ చేసిన విష యం వాస్తవమేనని తెలిపారు.

సమగ్ర విచా రణ చేస్తేనే ఎవరు? ఎందుకు? ట్యాప్ చేశార నే విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు. సీబీఐతో విచా రణ చేస్తేనే పూర్తి విషయాలు వెలుగులోకి వస్తాయని అభిప్రాయం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఈ కేసును సీబీఐకి అప్పజెప్పాలని డిమాండ్ చేశారు. మాయ మాటలు చెప్పి కాలం వెళ్లదీయకూడదని, ఫోన్లు ట్యాప్ ఎందుకు చేయవలసి వచ్చింది అనే విషయాలు పూర్తిస్థాయిలో బహిర్గతం కావలసిన అవసరం ఉన్నదన్నారు.