టీటీడీ ఈవోగా శ్యామలరావు బాధ్యతలు
17-06-2024 01:46 AM
హైదరాబాద్, జూన్ 16 (విజయక్రాంతి): తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా జే శ్యామలరావు ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం క్షేత్ర సంప్రదాయ ప్రకా రం వరహాస్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రపం చ నలుమూలల నుంచి స్వామివారి దర్శనా ర్థం భక్తులు తిరుమలకు వస్తారని పేర్కొన్నా రు. టీటీడీకి ఈవోగా రావడం తన అదృష్టమని, శ్రీవారి ఆశీస్సులతో తనకు తిరుమ లలో సేవ చేసే భాగ్యం దక్కిందన్నారు. అవకాశం కల్పించిన సీఎం చంద్రబాబుకు ధన్య వాదాలు తెలిపారు. భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని పేర్కొన్నారు. అనంతరం స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులతో మాట్లాడారు. క్యూలైన్లలో ఉన్నవారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.






