16 August, 2026 | 5:56 PM

అగ్నిమాపక శాఖ ఆధునీకరణ

17-06-2024 01:43 AM
  • 190 కోట్లతో నూతన భవనాలు, వాహనాలు

హైదరాబాద్, జూన్ 16 (విజయక్రాంతి): సవాళ్లకు అనుగుణంగా అగ్నిమాపక శాఖను ఆధునికీకరణకు ప్రభుత్వం నడుం బిగించింది. విపత్కర పరిస్థితులను సునాయాసంగా అధిగమించేందుకు వీలుగా నూతన సాంకేతిక పరిజ్ఞానంతో అధునాతన పరికరాలను సమకూర్చనుంది. రూ.190.14 కోట్లతో మౌలిక వసతుల కల్పనకు చర్యలు ప్రారంభించింది. హైదరాబాద్‌లో 100 నుంచి 200 మీటర్ల పైబడిన బహుళ అంతస్తుల నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి. ఆ భవనాల్లో ప్రమాదాలు సంభవించిన్నప్పుడు సంప్రదాయ పద్ధతుల్లో సహాయక చర్యలు చేపట్టడం కష్టం. అలాగే పరిశ్రమలు, గ్రామీణ ప్రాంతాల్లో అగ్ని ప్రమాద సహాయక చర్యలకు ఆధునిక యంత్రాలు అవసరం.

దీంతో శాఖ బలోపేతానికి సీఎం రేవంత్‌రెడ్డి దృష్టి సారించారు. రాష్ట్రంలో రూ.190.14 కోట్లతో కేంద్ర హోంశాఖ, అగ్నిమాపక శాఖ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. కేంద్ర ప్రభుత్వం రూ.142.61 కోట్లు, రాష్ట్రం రూ.47.53 కోట్లు వెచ్చించనుంది. 2026 నాటికి అగ్నిమాపక శాఖ పూర్తిస్థాయిలో బలోపేతం కానుంది. ముందుగా రూ.87.57 కోట్లతో ఆధునిక పరికరాలను కొనుగోలు చేయనున్నారు. రూ.57.4 కోట్లతో రాష్ట్రంలోని 18 నూతన అగ్నిమాపక కార్యాలయాలను ఆధునీకరించడం, నిర్మించడంతో పాటు వాహనాలు, అగ్నిమాప పరికరాలు కొనుగోలు చేయనున్నారు.