27 June, 2026 | 2:19 PM

Breaking News

రెండు చుక్కలే..చిన్నారుల భవిష్యత్‌ కు రక్షణ!   •   మల్లేపల్లి ధాన్యం కొనుగోలు కేంద్రం అక్రమాలపై 11 మందిపై కేసు నమోదు   •   ఎమ్మార్వోగా బాధ్యతలు చేపట్టిన రాష్ట్ర గ్రూప్-1 ప్రథమ ర్యాంకర్   •   ప్రమాదానికి మద్యం మత్తే కారణం   •   షాద్‌నగర్ ఆర్డీవో కార్యాలయంలో "ఎమ్మెల్యే" ఆకస్మిక తనిఖీ   •   సత్తుపల్లి మున్సిపాలిటీ 19వ వార్డు – తుమ్మూరి రామారావు వీధిలో ప్రజల దుస్థితి.   •   ఖమ్మం జిల్లాలో భారీ వర్షం.. రైతన్నల కళ్లలో ఆనందం   •   జ్యువెలరీ షోరూమ్‌లో రౌడీల వీరంగం   •   ప్రజల భవిష్యత్తును నిర్ణయించేది ఓటే: కమటం వెంకటేశ్వరరావు   •   నిండు వర్షంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి పొంగులేటి   •  

లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఎస్‌ఐ

07-05-2026 01:54 AM

బోధన్ పోలీస్‌స్టేషన్‌లో అదుపులోకి తీసుకున్న ఏసీబీ

కామారెడ్డి, మే 6 (విజయక్రాంతి): నిజామాబాద్ జిల్లా బోధన్ పోలీస్ స్టేషన్‌లో బుధవారం ఏసీబీ తనిఖీలు కలకలం సృష్టించాయి. పట్టణ ఎస్‌ఐ భాస్కరాచారి ఓ బాధితుడి నుంచి రూ.6 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ సంఘటన ఉమ్మడి జిల్లాలో కలకలం సృష్టించింది. బోధన్ పోలీస్ డివిజన్ పరిధిలోని రుద్రూరు, కోటగిరి, ఎడపల్లి, రెంజల్, నవీపేట్, వరిని పోలీస్ స్టేషన్లో పరిధిలో అవినీతి అక్రమాలు చోటు చేసుకుంటున్నాయని ఏసీబీ అధికారులకు పలుమార్లు ఫిర్యాదులందాయి.

దీంతో బోధన్ పోలీ స్ స్టేషన్‌పై బుధవారం తెల్లవారుజామున ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. పాత కేసు విషయంలో ఎస్‌ఐ భాస్కరచారి ఓ బాధితుడి నుంచి రూ. 10వేలు డిమాండ్ చేయగా రూ. 6 వేలకు ఒప్పందం కుదిరింది. నగదు తీసుకుంటుండగా తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఎస్‌ఐ భాస్కరాచారిని విచారిస్తున్నారు. విచారణ పూర్తి అయిన అనంతరం ఏసీబీ అధికారులు ఎస్‌ఐని నాంపల్లి ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు.