12-11-2025 12:00:00 AM
ములుగు పోలీస్ స్టేషన్‌లో ఏసీబీ దాడులు
గజ్వేల్, నవంబర్ 11(విజయక్రాంతి): సిద్దిపేట జిల్లా ములుగు పోలీస్ స్టేషన్‌లో మంగళవారం రాత్రి ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. రూ. 50వేల లంచం తీసుకుంటుండగా ములుగు ఎస్‌ఐ విజయ్ కుమార్‌ను పట్టుకున్నారు. ములుగు మండల పరిధిలోని క్షీరసాగర్ గ్రామంలో భూ వివాదం విషయంలో ఓ వర్గం నుంచి ఎస్‌ఐ విజయ్ కుమార్ రూ. 50వేల లంచం డి మాండ్ చేశారు.
సమాచారం అందుకున్న ఏసీబీ అధికారులు లంచం తీసుకుంటుంద గా ములుగు పోలీస్ స్టేషన్‌పై దాడి చేసి ఎస్‌ఐని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఎస్ ఐ తో పాటు ఏఆర్ కానిస్టేబుల్ రాజు ఈ వ్యవహారంలో పాలుపంచుకున్నట్లు తెలిసింది. ఏ సీబీ అధికారులు పోలీస్ స్టేషన్‌లో విచారణ కొనసాగిస్తున్నారు.