9 April, 2026 | 10:42 PM

Breaking News

అల్లూరి జిల్లాలో విషాదం— సెల్ఫీ సరదా విషాదంగా మారింది.. జలపాతంలో పడి ముగ్గురు మృతి   •   బాన్సువాడలో పలు రైస్ డిపోలపై సివిల్ సప్లై అధికారుల దాడులు   •   కేరళలో 75 శాతం పోలింగ్‌ నమోదు   •   ప్రగతి నగర్‌లో ఘనంగా ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలు   •   ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న సమస్యలను సత్వరమే పరిష్కరించాలి...   •   హెచ్ఐవిపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి   •   ఏజెన్సీ ప్రాంత రైతుల భూ సమస్యలను పరిష్కరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు   •   హనుమకొండ జిల్లాను వరంగల్ జిల్లాలో కలిపి మహానగరాన్ని అభివృద్ధి చేయండి   •   బీజేపీ ఆధ్వర్యంలో ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డు నమోదు   •   ప్రభుత్వ విద్య బలోపేతానికి కృషి చేస్తా..   •  

కోల్ బ్లాక్ భూ సేకరణ ప్రక్రియ పూర్తి చేయాలి

12-11-2025 12:00 AM

-పరిహారం పంపిణీ, పునరావాస చర్యలు పారదర్శకంగా జరగాలి

-ఇంధన శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్

కాటారం (మల్హర్), నవంబర్ 11 (విజయక్రాంతి): తాడిచర్ల 1 కోల్ బ్లాక్ ఓపెన్ కాస్ట్ మైన్‌కు అవసరమైన భూ సేకరణ ప్రక్రియ పూర్తి చేయాలని రాష్ట్ర ఇంధన శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్ తెలిపారు.మంగళవారం జన్కో సీఎండీ హరీశ్, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ,  థర్మల్, కోల్ డైరెక్టర్లుతో కలిసి తాడిచర్ల-1 కోల్ బ్లాక్ ఓపెన్ కాస్ట్ మైన్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులు మైనింగ్ కార్యకలాపాలు, ఉత్పత్తి ప్రక్రియ, భద్రతా ప్రమాణాలు, పర్యావరణ చర్యలు వంటి అంశాలను పరిశీలించారు.

భూసేకరణకు సంబంధించిన పరిహారం పంపిణీ, పునరావాస చర్యలు వంటి విషయాలపై సం బంధిత అధికారులను అడిగి తెలుసుకున్నా రు. అనంతరం ఏఎంఆర్ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు.భూసేకరణ, పునరావాస చర్యలు న్యాయబద్ధంగా, పారదర్శ కంగా, వేగంగా పూర్తిచేయాలని సూచించా రు. తాడిచర్ల నుంచి కేటీపీపీ వరకు కన్వేయర్ బెల్ట్ నిర్మాణం, రవాణామార్గం, దూరాభారాలపై ఇంజనీరింగ్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కార్యక్రమాల్లో థర్మల్ డైరెక్టర్ రాజశేఖర్ రెడ్డి, కోల్ డైరెక్టర్ రాగ్యా, విద్యుత్తు శాఖ ఈడీ లక్ష్మయ్య, కేటీపీపీ సీఈశ్రీప్రకాష్, ఎస్ ఈ ముత్యాల రావు, అదనపు కలెక్టర్ అశోక్ కుమార్, విద్యుత్తు శాఖ ఎస్‌ఈ, మల్చూర్ నాయక్, తహసీల్దార్ రవి కుమార్, ఏఎంఆర్ ప్రతినిధులు పాల్గొన్నారు.