14 March, 2026 | 6:23 AM

అథ్లెటిక్ పోటీలకు సిద్ధార్థ విద్యార్థి ఎంపిక

14-03-2026 12:00 AM

రిషిక్‌ను అభినందించిన పాఠశాల చైర్మన్ తదితరులు

కరీంనగర్, మార్చి 13(విజయక్రాంతి): అథ్లెటిక్ అసోసియేషన్ కరీంనగర్ జిల్లా వారు స్పోరట్స్ స్కూల్‌లో ఈ నెల 9న నిర్వహించిన అథ్లెటిక్ పోటీల్లో స్థానిక భగత్‌నగ ర్‌లోని సిద్ధార్థ విద్యాసంస్థల విద్యార్థి ఉత్తమ ప్రతిభ కనబరిచాడు.

నెల 15న జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియం, హనుమకొండలో జరిగే అండర్ 14 విభాగంలో 600 మీటర్లు పోటీలో 6వ తరగతి చదువుచున్న ఎ. రిషిక్ రాష్ట్ర స్థాయికి ఎంపికయ్యాడు. ఈ సందర్భం గా ఉత్తమ ప్రతిభ కరబరిచి రాష్ట్ర స్థాయికి ఎంపికైన విద్యార్థిని చైర్మన్ దాసరి శ్రీపాల్ రెడ్డి అభినందిస్తూ, పాఠశాలకు, తల్లిదండ్రులకు పేరు ప్రఖ్యాతులు తీసుకొని రావాలని అన్నారు.ఈ కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ దాసరి శ్రీపాల్ రెడ్డి, డైరెక్టర్ స్వప్న శ్రీపాల్ రెడ్డి , ఉపాధ్యాయ బృందం, ఇతర విద్యార్థులు ఎంపికైన విద్యార్థిని అభినందించారు.