22-07-2025 06:30:17 PM
కొత్తపల్లి (విజయక్రాంతి): నిగమ ఇంజనీరింగ్ కళాశాల(Nigama Engineering College)లోని ఎంబీఏ విభాగం విద్యార్థులు మంగళవారం రోజున అద్భుతమైన జ్ఞాపకంగా నిలిచిపోయే విధంగా సిగ్నేచర్ డే కార్యక్రమాన్ని నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఒకరినొకరు సంతకాలు చేసి, జ్ఞాపకాలతో కూడిన సందేశాలను పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల చైర్మన్ బివీఆర్ గోపాల్ రెడ్డి, జాయింట్ సెక్రటరీ, ప్రిన్సిపల్ డా. రత్నా గోపాల్, ప్రిన్సిపాల్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.