22-07-2025 06:33:25 PM
చెక్కును అందజేసిన వజ్రేష్ యాదవ్..
మేడిపల్లి: బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మేడ్చల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్(Congress Party Incharge Thotakura Vajresh Yadav), బోడుప్పల్ మాజీ కార్పొరేటర్ సింగిరెడ్డి పద్మా రెడ్డి ఆధ్వర్యంలో ఐదవ డివిజన్ ఎన్ఐఎన్ కాలనీకి చెందిన బత్తుల మల్లారెడ్డి కుటుంబానికి మంజూరైన 50,000/- రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును వజ్రేష్ యాదవ్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అనారోగ్యాల బారిన పడుతున్న వారికి వైద్య ఖర్చుల నిమిత్తం ఆర్థిక సాయం, ఆపద సమయంలో అండగా సీఎం రిలీఫ్ ఫండ్ ఒక వరంలా మారిందని, ప్రతి పేద ప్రజలకు ప్రభుత్వ పథకాలు అందుతున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో మబ్బు సత్యనారాయణ, రాములు, తదితరులు పాల్గొన్నారు.