22-07-2025 06:27:25 PM
వాసవి క్లబ్ వైస్ గవర్నర్ జితేందర్ మహాజన్..
ఖానాపూర్ (విజయక్రాంతి): దంత సంరక్షణ, నోటి భద్రతపై ప్రతి ఒక్కరూ శ్రద్ధ చూపాలని వాసవి క్లబ్ వైస్ గవర్నర్ జితేందర్ మహాజన్(Jitender Mahajan) అన్నారు. మంగళవారం నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం రంగపేట గ్రామంలో ఉచిత దంత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆ గ్రామ పరిసర ప్రాంత ప్రజలకు దంత, నోటి సంరక్షణ సూచనలను చేశారు. దాదాపు 120 మంది రోగులను స్క్రీనింగ్ చేసి, ఉచిత మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సాగి లక్ష్మణరావు, పంచాయతీ సెక్రెటరీ దేవేందర్ రెడ్డి, గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు కటకం శ్రీనివాస్, లింగారెడ్డి, మహాజన్ జలంధర్ గుప్తా, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.