25-05-2025 05:41:23 PM
మహబూబాబాద్ (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా(Mahabubabad District) కేసముద్రం మున్సిపాలిటీలోని ఎస్వీవి హైస్కూల్ 2000-01 బ్యాచ్ పూర్వ విద్యార్థులు ఆదివారం రజతోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకకు విద్యార్థులతో పాటు పూర్వ ఉపాధ్యాయులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎస్వీవీ హైస్కూల్ అధినేత ఎడ్ల అశోక్ రెడ్డి మాట్లాడుతూ... పూర్వ విద్యార్థులందరినీ చాలాకాలం తర్వాత కలుసుకోవడం ఆనందం కలిగించిందని చెప్పారు. విద్యార్థులంతా ఉన్నత స్థాయికి ఎదిగి ఇలా గురువులను సత్కరించడం సంతోషకర విషయమన్నారు.
ప్రతి విద్యార్ధి కూడా మంచి మార్గం వైపు పయనించాలని, పట్టుదలతో సాధించలేనిది ఏదీ లేదని చెప్పారు. మీ పిల్లలని మీ లాగే ఉన్నత శిఖరాలకు ఎదిగేలా ప్రోత్సాహం అందించడంతో పాటు తల్లిదండ్రులను గౌరవిస్తూ వారిని మరువరాదన్నారు. నేను అనే భావన పక్కన పెట్టి మనం, మన దేశం అనే భావన పెంపొందించుకోవాలని చెప్పారు. ఈ సందర్భంగా విద్యార్థులంతా కలిసి ఆయనను ఘనంగా సత్కరించారు. అందరూ కలిసి ఆట పాటతో ఎంజాయ్ చేశారు. ఈ వేడుకలో పాల్వాయి నవీన్ రెడ్డి, రావుల శ్రీకాంత్, రవీందర్, నర్సింగం వెంకటేశ్వర్లు, గంగాపురం రవి, వెలిశాల హారిక, మారగాని హరిత, ఎలుక కవిత, నెలకుర్తి శిరీష తదితరులు పాల్గొన్నారు.