calender_icon.png 25 May, 2025 | 10:04 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వైనాల రాజును సన్మానించిన గొల్ల, కురుమ సంఘం నాయకులు

25-05-2025 05:43:41 PM

మంథని (విజయక్రాంతి): కమాన్ పూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు వైనాల రాజును గొల్ల కురుమ సంఘం నాయకులు ఆదివారం జూలపల్లిలో ఘనంగా సన్మానించారు. గొల్ల కురుమల ఆరాధ్య దైవమైన బీరన్న గుడి నిర్మాణానికి రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు(Minister Duddilla Sridhar Babu) ద్వారా నిధులు మంజూరు చేయించి తమ వంతుగా సైతం ఆర్థిక సహాయం అందజేసిన వైనాల రాజును గొల్ల కురుమలు శాలువతో సత్కరించారు. అలాగే వీరన్న ఆలయంలో ఇటీవల భారీ ఎత్తున వీరన్న కొలుపు ఉత్సవాల్లో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో గొల్ల కురుమ నాయకులు కొమ్ము వెంకన్న, కొమ్ము రాయమల్లు, కొమ్ము రాజ్యం, నలిగే పర్వతాలు, బూస తిరుపతి, మారవుల ముత్యాలు, పోచాలు తదితరులు పాల్గొన్నారు.