15 July, 2026 | 5:50 PM

Breaking News

ఆమ్దాపూర్ న్యూ పాఠశాల విద్యార్థులకు 135 స్కూల్ బ్యాగుల పంపిణీ

15-07-2026 05:46 PM

బోధన్,(విజయక్రాంతి): బోధన్ మండలంలోని ఆమ్దాపూర్ ప్రాథమిక పాఠశాలలో నర్సరీ నుంచి 5వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు మంగళవారం స్కూల్ బ్యాగులను పంపిణీ చేశారు. నిజామాబాద్‌కు చెందిన శ్రీరామ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో సుమారు 135 స్కూల్ బ్యాగులను విద్యార్థులకు అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు చదువులో రాణించి ఉన్నత లక్ష్యాలను సాధించాలని సంస్థ ప్రతినిధులు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎన్. సాయిలు, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు సూర్యకుమార్, గ్రామ సర్పంచ్ పోరెడ్డి గంగాధర్, ఉపసర్పంచ్, శ్రీరామ స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు టి. శ్రీనివాస్, క్యాషియర్ రామ్మోహన్, సభ్యులు శేఖర్, రమేష్, నవీన్, సంస్థ కార్యవర్గ సభ్యులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.