ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ సమస్యలు చెప్పండి
15-07-2026 06:11 PM
నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ కి రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య వస్తున్నారని జిల్లా అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడు బత్తుల రంజిత్ తెలిపారు. జిల్లా లోని ఎస్సీ ఎస్టీ సంఘాలు, అట్రాసిటీ కేసు బాధితులు వచ్చి వారి సమస్యలని కమీషన్ చైర్మన్ కి తెలియజేసుకోవాలని ఈ అవకాశాన్ని జిల్లా లోని దళిత ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. నిర్మల్ జిల్లాలో పర్యటించనున్న ఆయనకు కలిగిన సమస్యలను దృష్టికి తేవాలని సూచించారు.నాయకులు ఆకుల రమేష్, మసీదు రమేష్, మాడుస్తూ భూమేష్ తదితరులు పాల్గొన్నారు






