15 July, 2026 | 5:42 PM

విద్యుత్ సమస్యల పరిష్కారం చేస్తాం..

15-07-2026 05:42 PM

ఉట్నూర్,(విజయక్రాంతి): మారుమూల గ్రామాల్లో నెలకొన్న విద్యుత్ సమస్యలను వినియోగదారుల నుండి తెలుసుకొని వాటి పరిష్కారానికి కృషి చేసినందుకే పరిష్కార వేదికలు నిర్వహిస్తున్నామని విద్యుత్ సమస్యల పరిష్కార వేదిక చైర్ పర్సన్ జైవంత్ రావు చవాన్ అన్నారు. బుధవారం ఉట్నూర్ మండల విద్యుత్ శాఖ కార్యాలయంలో విద్యుత్ వినియోగదారుల పరిష్కార వేదికను నిర్వహించారు.

ఈ వేదికలో ఉట్నూర్, ఇంద్రవెల్లి, నార్నూర్, గాదిగూడ  మండలాల పరిధిలోని విద్యుత్ వినియోగదారుల నుండి  వారి సమస్యల వినతి పత్రాలను స్వీకరించారు. అనంతరం వినియోగదారులు ఉద్దేశించి  చైర్ పర్సన్ మాట్లాడుతూ.. అధిక బిల్లులు, విద్యుత్ స్తంభాలు, ఇతర సమస్యలు వేదిక దృష్టికి వచ్చాయని వాటిని  విద్యుత్ శాఖ అధికారులకు పంపించి పరిష్కారం చేస్తామని అన్నారు. వేదికలో శ్రీనివాస్, ఏడీలు తిరుపతి, ఈదన్న, ఏ ఈ లు రోహిదాస్ జాదవ్, వింధ్య , విద్యుత్ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.