మొబైల్ ఫోన్ల రికవరీలో అద్భుతం జిల్లా పోలీస్ యంత్రాంగం
ఆరు లక్షల విలువ గల 63 మొబైల్ ఫోన్లు రికవరీ...
జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే
రాజన్న సిరిసిల్ల, ఫిబ్రవరి 25 (విజయక్రాంతి): జిల్లా పోలీస్ సెల్ ఫోన్ రికవరీ మే ళా ఏర్పాటు చేసి జిల్లాలో గత కొన్ని రోజుల నుండి పోయిన , చోరీకి గురైన సుమారు ఆరు లక్షల రూ.విలువ గల 63 ఫోన్ల ఆచూకీ మన రాష్ట్రంలోనే కాకుండా పొరుగు రాష్ట్రాలలోని వివిధ ప్రాంతాల నుండి రికవరీ చేసి జిల్లా ఎస్పీ చేతుల మీదుగా సంబంధిత మొబైల్ ఫోన్ల యజమనులకి అందజేయడం జరిగింది.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రస్తుత రోజుల్లో మొబైల్ ఫోన్ లేని దే ఒక చిన్న లావాదేవీ కూడా చేయలేని, మన యొక్క విలువైన సమాచారం బ్యాంక్ అకౌంట్స్, పాస్ వరడ్స్ వంటివి మొబైలో సేవ్ చేసి పెట్టుకుంటారని తెలిసిన నేరగాళ్లు మొబైల్ దొంగిలించి,వీక్ పాస్ వరడ్స్ లను బ్రేక్ చేసి ఫోన్ పే,గూగుల్ పే తదితర మద్యమాల ద్వారా డబ్బులు కాజేస్తున్నారన్నారు. మొబైల్ ఫోన్ పోగొట్టుకున్న వ్యక్తులు కేవ లం మొబైల్ ఫోన్ మాత్రమే కాకుండా తమ వ్యక్తిగత సమాచారంతో సహ డబ్బులను కూడా కోల్పోవడం జరుగుతుందన్నారు.
ఎ వరైన మొబైల్ పోగొట్టుకున్న లేదా దొంగిలించబడిన వెంటనే బ్లాక్ చేసి, సంభందిత పోలీసు స్టేషన్ లో సమాచారం ఇవ్వాలని సూచించారు.జిల్లా ప్రజలకు తెలియజేయునది ఏమనగా ఎవరైనా సెకండ్ హ్యాండ్ మొ బైల్ ఫోన్ లను కొనుగోలు చేసినట్లైతే అట్టి షాప్ యజమాని నుండి రసీదు తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు.సెల్ ఫోన్ దొంగలు దొంగిలించిన ఫోన్ లను మొబైల్ షాప్ లలో అమ్ముతున్నారని, తక్కువ ధరకు వస్తుందని దొంగిలించబడిన ఫోన్ అని తెలియక కొనుగోలు చేసి అమాయక ప్రజలు మోసాలకు గురి అవుతున్నారని అన్నారు.
ఎవరైన దొంగిలించబడిన ఫోన్ అని తెలిసి కూడా కొనుగోలు చేసినట్లైతే అట్టి వ్యక్తులపై క్రిమినల్ కేసులు నమోదు చేయడం జరుగుతుందన్నారు.సీఈఐఆర్ అప్లికేషన్ ద్వారా జిల్లాలో పోయిన మొబైల్ ఫోన్స్ రికవరీ చేసి బాధితులకు అప్పగించడంలో కృషి చేస్తున్న ఐ.టి కోర్ ఎస్.ఐ కిరణ్ కుమార్ ,కానిస్టేబుల్ రాజాతిరుమలేష్ లను జిల్లా ఎస్పీ అభినందించారు. పోయిన మొబైల్ ఫోను మళ్లీ దొరకదనుకున్న మొబైల్ ఫోన్ జిల్లా పోలీసులు టెక్నాలజీ ఉపయోగించి ఫోన్ రికవరీ చేసి అందించినందుకు సంబంధిత బాధితులు జిల్లా ఎస్పీ, పోలీస్ సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఐటి కోర్ ఎస్.ఐ కిరణ్ కుమార్, ఆర్.ఐ యాదగిరి,కానిస్టేబుల్ రాజాతిరుమలేష్ సిబ్బంది పాల్గొన్నారు.




