సింగరేణికే గర్వకారణం
- ఆ సంస్థ సీఎండీ ఎన్ బలరామ్
- కవి, గాయకుడు జయరాజ్‌కు సన్మానం
హైదరాబాద్, డిసెంబర్ 10 (విజయక్రాంతి): తెలంగాణ ఉద్యమంలో పోషించిన జయరాజ్‌ను తామ్రపత్రం, నగదు పురస్కారంతో సన్మా నిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించడం సింగరేణియులకు గర్వకారణ మని ఆ సంస్థ సీఎండీ ఎన్ బలరామ్ అన్నారు.
జయరాజ్ పర్యావర ణ పరిరక్షణ, అక్షరాస్యత పెంపునకు తన రచనల ద్వారా ఎంతో కృషి చేశారని ఆయన పేర్కొన్నారు. సింగరేణి భవన్‌లో మంగళవారం సింగరేణి ఉద్యోగి, కవి జయరాజ్‌ను సన్మానించారు. ఈ సందర్భంగా సీఎండీ మా ట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిన తొమ్మిది మంది కళాకారుల జాబితాలో జయరాజుకు చోటు దక్క డం సింగరేణియులందరికీ లభించిన గౌరవమన్నారు.
సంస్థ అందించిన సహకారం, ప్రోత్సాహం వల్లే తాను కవిగా, ఉద్యమకారుడిగా ఉన్నతస్థాయికి ఎదిగానని జయరాజ్ భావోద్వే గానికి గురయ్యారు. కార్యక్రమంలో రాష్ట్ర కనీస వేతనాల సలహా మండలి చైర్మన్ జనక్‌ప్రసాద్, సింగరేణి సంస్థ డైరెక్టర్లు జి వెంకటేశ్వర్‌రెడ్డి, సుభానీ, జీఎం రవిప్రసాద్, కవితా నాయుడు తదితరులు పాల్గొన్నారు.






