వారిలో తెలంగాణ భావోద్వేగం లేదు
- రాష్ట్ర సంస్కృతి మంట గలిసింది
- పార్టీ గుర్తు ప్రచారానికే కొత్త తల్లి
- మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి
హైదరాబాద్, డిసెంబర్ 10 (విజయక్రాంతి): తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ పేరిట జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ఏ ఒక్కరిలో తెలంగాణ భావోద్వేగం లేదని.. బతుకమ్మ చీరలు ఇచ్చి సమై క్య బాస్‌లను సంతృప్తి పరిచేందుకు కొత్త తల్లిని సృష్టించారని మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి మండిపడ్డారు.
ప్రజాపాలన విజయో త్సవ సంబరాల్లో తెలంగాణ సంస్కృతి మం టగలిసిందని ఆయన ఆవేదన వ్యక్తం చే శారు. తెలంగాణ భవన్‌లో మంగళవారం ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు బాల్క సుమన్, మెతుకు ఆనంద్‌తో కలిసి జగదీశ్‌రెడ్డి మీడియాతో మాట్లా డారు. నాడు శాసనసభలో తెలంగాణ పదా న్ని నిషేధించే స్థాయికి వెళ్లారని, అటువంటి సమయంలోనే జయశంకర్ సార్ లాంటి వాళ్లు ఉ ద్యమం చేపట్టారని గుర్తు చేశారు.
నేల తల్లిని విము క్తం చేయాలని ఉద్యమకారులు కం కణం కట్టుకో గా కేసీఆర్ ఇరుసులా ఉండి ఉద్యమాన్ని కొనసాగించారని పేర్కొన్నా రు. తెలంగాణ ఉద్యమం నుంచే తెలంగాణ తల్లి పుట్టిందని.. ఆమె విగ్రహాన్ని అనేక కళారూపాలతో తెలంగాణ భవన్‌లో ప్రతిష్ఠించుకున్నామన్నారు. తెలంగాణ తల్లిని చంపుతానని తుపాకీ పట్టుకుని బయలుదేరిన నాయకుడు కొత్త తల్లిని తీసుకొచ్చాడని ఎద్దేవా చేశారు.
కిరాయి రాతగాళ్లు రాసిచ్చిన స్క్రిప్ట్‌ను సీఎం రేవంత్ చదివారని, ఇది తెలంగాణ సంస్కృతిపై జరుగుతున్న భయంకరమైన దాడి అని మండిపడ్డారు. తెలంగాణ వాదులు అప్రమత్తం కావాలని, ఉద్యమం సృష్టించిన తల్లే మన తల్లి.. కాంగ్రెస్ పార్టీ గుర్తును ప్రచారం చేసేందుకే కొత్త తల్లిని తెచ్చారని విమర్శించారు. కోయిలలు ఉన్న చోట కాకిలా ప్రవర్తించి దృష్టిని ఆకర్షించాలనే మూర్ఖపు ఆలోచన సీఎం రేవంత్‌లో అడుగడునా ఉందన్నారు.






