మాజీ స్పీకర్ దివంగత శ్రీపాదరావుకు సింగరేణి నివాళులు
- శ్రీపాదరావు జయంతి వేడుకలు
- మందమర్రి జీఎం రాధాకృష్ణ
బెల్లంపల్లి,(విజయక్రాంతి): మాజీ స్పీకర్ దివంగత దుద్దిల్ల శ్రీపాద రావు జయంతీ వేడుకలు సింగరేణి ఆధ్వర్యంలో ఘనంగా జరిపారు. మందమర్రి ఏరియా జనరల్ మేనేజర్ కార్యాలయంలో రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలమేరకు మాజీ స్పీకర్ స్వర్గీయ శ్రీపాదరావు జయంతిని ఏరియా జనరల్ మేనేజర్ ఎన్ రాధాకృష్ణ నిర్వహించారు. శ్రీపాద రావు చిత్రపటానికి జిఎం రాధాకృష్ణ, యూనియన్ నాయకులు, అధికారులు, పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా జీఎం రాధాకృష్ణ మాట్లాడుతూ బడుగుబలహీన వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేసిన నాయకుడు శ్రీపాదరావు అని కొనియాడారు, ఆయన ఉమ్మడి రాష్ట్ర శాసనసభ స్పీకర్‌గా సమర్థ వంతంగా పనిచేశారన్నారు.
డి. శ్రీపాదరావు జీవితాన్ని ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్.ఓ.టు జి.ఎం జీఎల్ ప్రసాద్, ఏఐటీయూసీ బెల్లంపల్లి బ్రాంచ్ సెక్రటరీ దాగం మల్లేష్, డీజీఎం పర్సనల్ అశోక్, సీ.ఎం.ఓ.ఏ.ఐ జాయింట్ సెక్రెటరీ రవి, సీనియర్ పర్సనల్ ఆఫీసర్ సత్యనారాయణ, AITUC జి.ఎం స్ట్రక్చర్ కమిటీ మెంబర్ రమణ పాల్గొన్నారు.




