19-10-2025 12:58:43 PM
తుంగతుర్తి,(విజయక్రాంతి): తమతో చిన్ననాటి నుండి చదువుకున్న మిత్రుడు నూతనంగా నిర్మించుకుంటున్న ఇంటికి ఆర్థిక సహాయం చేసి స్నేహబంధం ప్రాముఖ్యతను మరియు కష్టకాలంలో ఒకరికొకరు తోడుగా ఉండటాన్ని తెలియజేప్పారు. మండల పరిధిలోని వెంపటి గ్రామానికి చెందిన నిరుపేద షేక్ పాషాకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు కాగా తమవంతుగా 2008-09 పదవ తరగతి స్నేహితులు ఆదివారం రూ.15000లను ఇంటి నిర్మాణానికి ఆర్థిక సహాయం చేసి తమ మిత్రుడికి మనోధైర్యాన్ని కల్పించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...స్నేహానికి మించిన బంధం మరొకటి లేదని అందరితో మమేకమై కలివిడిగా కష్టసుఖాలను పాలుపంచుకునే స్నేహ బంధం అన్నారు. తమతో చదువుకున్న వ్యక్తి నిరుపేదరికంలో ఉంటూ ఉండడానికి ఇల్లు లేకపోవడంతో ఇందిరమ్మ ఇల్లు మంజూరు కాగా తమ వంతుగా ఇంటి నిర్మాణానికి ఆర్థిక సహాయం చేయడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. సహాయం అందజేసిన వారిలో మిరియాల యాకేష్, గిలకత్తుల మహేష్, పసుపులేటి వెంకన్న, చిటపాక శ్రీను, సందీప్, మహేష్ తదితరులు ఉన్నారు.