08-09-2025 02:09:01 AM
హైదరాబాద్, సెప్టెంబర్ 7 (విజయక్రాంతి): రోజురోజుకూ అందుబాటులో ఉన్న బొగ్గు గనులు, అందులో నుంచి వస్తు న్న ఉత్పత్తి తగ్గిపోయే ప్రమాదాన్ని సింగరేణి ఎదుర్కొంటోంది. మరో పక్క కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఉన్న బొగ్గుగనులకు వేలంపాట నిర్వహించి సంస్థలకు కేటా యిస్తోంది. ఈ వేలంపాటలో దేశంలోని ప్ర భుత్వరంగ, ప్రైవేటు బొగ్గు ఉత్పత్తి సంస్థలు పాల్గొంటూ.. లాభదాయకమైన గనులను చేజిక్కించుకుంటున్నాయి.
కానీ రాష్ట్రప్రభుత్వం నిర్ణయం తీసుకోలేని కారణంగా సింగరేణి సంస్థ బొగ్గు గనుల వేలంపాటల్లో పాల్గొనడం లేదు. దీంతో తెలంగాణ వ్యా ప్తంగా ఉన్న గోదావరి నదీలోయ ప్రాం తాల్లోని బొగ్గు గనులను కూడా సింగరేణి ఇతర సంస్థలకు కోల్పోవాల్సి వస్తోంది. ఆఖరికి సింగరేణి పుట్టినిల్లయిన ఇల్లెందు ప్రాంతంలోనూ సింగరేణికి గనులు లేని పరిస్థితి నెల కొంటుంది.
కేంద్ర ప్రభుత్వం బొగ్గుగనుల కేటాయింపును రెండు విధాలుగా కేటాయిస్తుంది. గతంలో సింగరేణి, కోల్ ఇండియా, నైవేలీ లిగ్నైట్ కార్పొరేషన్, మహానది కోల్‌ఫీల్ట్ లాంటి ప్రభుత్వ రంగ సంస్థలకు కేంద్రమే బొగ్గు గనులను కేటాయిస్తూ వచ్చేది. అయి తే దేశవ్యాప్తంగా బొగ్గు గనుల కేటాయింపుపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుమేరకు.. కేంద్ర ప్రభుత్వం పారదర్శకంగా వేలంపాట ద్వారా బొగ్గు గనులను వివిధ ప్రభుత్వ, ప్రైవేటు బొగ్గు ఉత్పత్తి సంస్థలకు కేటాయి స్తూ వస్తోంది.
దీనితో ప్రభుత్వ రంగం సంస్థలైనా.. ప్రైవేటు సంస్థలైనా.. వేలంపాటలో పాల్గొని.. బొగ్గుగనులను చేజిక్కించుకోవచ్చు. కానీ మిగతా ప్రభుత్వ రంగ సంస్థలు వేలంపాటల్లో పాల్గొని కొత్త, కొత్త బొగ్గు గనులను తీసుకుంటున్నా.. సింగరేణి సంస్థ మాత్రం ఇప్పటి వరకు వేలంపాటలో పాల్గొనడం లేదు.
దీనివల్ల లాభదాయకమైన బొ గ్గు గనులను కోల్పోవాల్సి వస్తోంది. గతం లో మాదిరిగానే ప్రభుత్వమే నేరుగా బొగ్గు గనులను సింగరేణికి కేటాయించాలనే ఆలోచనతో.. గత ప్రభుత్వాలు వేలంపాటపై వి ముఖత చూపాయి. అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత.. ఈ ఆలోచన విధానంలో మార్పువచ్చినా.. నిర్ణయం తీసుకోవడంలో మాత్రం ఆలస్యం జరుగుతోంది.
సింగరేణికి లాభాల పంట..
వేలంపాటలో పాల్గొని బొగ్గు గనులను తీసుకోవడం ద్వారా సింగరేణి సంస్థ తన భవిష్యత్తును తీర్చిదిద్దుకోవచ్చు. ప్రస్తుతం సింగరేణి ఆధ్వర్యంలో ఉన్న గనుల్లో బొగ్గు నిల్వలు తగ్గడం వల్ల భవిష్యత్తులో ఉత్పత్తి తగ్గిపోతుంది. కొత్త బ్లాకులు సంపాదిస్తే.. సింగరేణికి మరింత ఆర్థిక పరిపుష్ఠి కలుగుతుంది. కొత్త గనులు వస్తే.. వేలాది మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయి.
రాష్ట్రానికి పన్నుల వాటా..
బొగ్గు ఉత్పత్తి పెరగడం ద్వారా రాష్ట్ర ప్ర భుత్వానికి డీఎంఎఫ్టీ నిధులు పెరుగుతాయి. కొత్త బ్లాక్‌లు రావడం వల్ల కేంద్ర, రాష్ట్ర ప్ర భుత్వాలకు మరింత ఎక్కువగా డివిడెండ్ వ స్తుంది. సింగరేణిలో కేంద్రానికి 49 శాతం, రాష్ట్రానికి 51 శాతం వాటా ఉంది. అదే నిష్పత్తిలో డివిడెండ్ ఉంటుంది. పన్నులు, రాయ ల్టీల రూపంలో ఆదాయం వస్తుంది. కొత్త గ నుల నుంచి బొగ్గు ఉత్పత్తి జరగడం వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి భారీగా పన్నుల రూపం లో ఆదాయం వస్తుంది.
వేలంపాటల ద్వారా కేంద్రానికి భారీగా ఆదాయం వస్తుంది. వేలంపాటల్లో బ్లాక్‌లు వచ్చిన సంస్థలు బ్యాంక్ గ్యారంటీలు ఇవ్వా లి. జీఎస్టీతోపాటు బొగ్గు విక్రయాలపై సరుకుల, సేవల పన్ను రూపంలో కేంద్రానికి భారీగా ఆదాయం వస్తుంది.
రూ.400 కోట్ల నష్టం..
వాస్తవానికి కేంద్రం నామినేషన్‌పై బొగ్గు బ్లాక్‌లను కేటాయించడం.. లేదా వేలంపాటలో పాల్గొని దక్కించుకోవడం అనే రెండు ప్రక్రియల్లో ఏది లాభదాయకం అంటే.. వేలంపాటలో పాల్గొనడమే లాభదాయకమనే అభిప్రాయం సింగరేణి యాజమా న్యవర్గం నుంచి స్పష్టమైన వాదన వినిపిస్తోంది. నామినేషన్‌పై బొగ్గు గనిని కేటా యిస్తే.. కేంద్రానికి చెల్లించాల్సిన రాయల్టీ అత్యధికంగా ఉంటుందని.. అదే వేలంపాటలో పాల్గొని బొగ్గు బ్లాక్‌ను చేజిక్కించు కుంటే.. చెల్లించే రాయల్టీ తక్కువగా ఉంటుందని, తద్వారా ఏటా సింగరేణికి కనీసం రూ.400 కోట్ల వరకు మిగులుతుందని సింగరేణి అధికార వర్గాలు అంటున్నాయి.
సింగరేణిపై ప్రభావం..
కోల్ ఇండియా ప్రభుత్వ రంగ సంస్థ అ యినా.. వేలంపాటల్లో పాల్గొని కొత్త బ్లాక్‌లను పొందుతోంది. దీనివల్ల ఆ సంస్థ ఉత్ప త్తి 500 మిలియన్ టన్నుల నుంచి 880 మిలియన్ టన్నులకు పెరిగింది. ఇదే సమయంలో వేలంపాటల్లో పాల్గొనకపోవడం వల్ల సింగరేణి ఉత్పత్తి 60 నుంచి 70 మిలియన్ టన్నుల మధ్యనే నిలిచిపోయింది. కేవ లం విద్యు త్తు ఉత్పత్తి సంస్థ అయిన ఎన్టీపీసీ కూడా బొగ్గు ఉత్పత్తి రంగంలోకి అడుగుపెట్టి 80 మిలియన్ టన్నుల లక్ష్యం దిశగా సాగుతోంది.
ఇది సింగరేణి ఉత్పత్తి కంటే ఎక్కువ కావడం గమనార్హం. కొత్త బ్లాక్‌లు రాక.. ఉత్పత్తిలో వెనుకబడే ప్రమాదాన్ని సింగరేణి ఎదుర్కొంటోంది. వాస్తవానికి దేశంలో బొగ్గు డిమాండ్ మరో 25 ఏండ్లపాటే ఉండే అవకాశం ఉంది. ఈ నేపథ్యం లో సింగరేణి పరిధిలో రానున్న 5 ఏండ్లలో 10 గనులు మూతపడనున్నా యి. ఇల్లందు, మణుగూరు, రామగుం డం మందమర్రి, బెల్లంపల్లి లాంటి ఏరియాల మనుగడ ప్రశ్నార్థకమవుతున్నాయి.
భవిష్యత్తులో కొత్త గనులు రాక పోతే.. ప్రస్తుతం సింగరేణిలో పనిచేస్తున్న ఉద్యోగుల సంఖ్య.. అప్పటి అవసరాలకు మించి 8000 మంది ఉన్నట్టు అవుతుంది. ఈ సిబ్బందిని సద్వినియోగం చేసుకోవాలంటే కొత్త బ్లాక్‌లు రావాల్సిందే. లేకపోతే బొగ్గు రంగంలో సింగ రేణి మనుగడ కష్టతరమే. ఇప్పటికే సత్తుపల్లి, కోయ గూడెం బ్లాక్‌లను కోల్పో వడంతో సింగరేణి భారీ నష్టం సంభవించింది.
కేంద్రం నిర్వహించిన వేలం పాటలో పాల్గొనకపోవడం వల్ల సింగరేణికి సుమారు రూ.60 వేల కోట్ల ఆదా యాన్ని కోల్పోయినట్టయ్యింది. ఇందులో సింగరేణికి వచ్చే రూ. 15 వేల కోట్ల లాభాలున్నాయి. ఈ లాభాలనూ సింగరేణి కోల్పోయినట్టే. కోయగూడెం బ్లాక్ ద్వారా రూ.40 వేల కోట్లు, సత్తుపల్లి బ్లాక్ నుంచి దాదాపు రూ.23 వేల కోట్ల ఆదాయాన్ని సింగరేణి కోల్పోయింది.