08-09-2025 01:39:22 AM
వరంగల్‌ను ముంచెత్తిన వాన
వరంగల్/హనుమకొండ/వడ్డేపల్లి(మహబూబాబాద్), సెప్టెంబర్ 7 (విజయక్రాంతి): ఉమ్మడి వరంగల్ జిల్లాను వర్షం ముంచెత్తింది. ఆదివారం తెల్లవారుజాము నుంచి ఉదయం 9 గంటల వరకు భారీ వర్షం కురవడంతో రోడ్ల మీద వరద ప్రవాహం కనిపించింది. ఎటు చూసినా నడుములోతు నీళ్లతో రోడ్లు నిండిపోయాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం గా మారాయి. పలు ప్రాంతాల్లో ఇండ్లలోకి వరద నీరు చేరింది.
రెండు గంటల పాటు ఏక బిగిన కురిసిన వర్షంతో గ్రేటర్ వరంగల్ పరిధిలో ప్రధాన కూడళ్లు వరద ప్రవాహంతో చెరువులను తలపించాయి. వరంగల్ నుంచి కాజీపేట వరకు అలంకార్ చౌరస్తా, హనుమకొండ చౌరస్తా, హంటర్ రోడ్డు, ఎన్జీవోస్ కాలనీ తదితర ప్రాంతాల్లో రోడ్లన్నీ వరద ప్రవాహంతో వాగులుగా మారిపోయాయి. వరద ఉధృతి వల్ల హనుమకొండ ఆర్టిసీ బస్టాండ్ ఆవరణ చెరువుగా మారింది. కొంతసేపు బస్సుల రాకపోకలకు ఆటంకం కలిగింది.
వరద నీటిలో చిక్కి ద్విచక్ర వాహనాలు, కార్లు, ఆటోలు, తేలికపాటి వాహనాలు మోరాయించాయి. నాళా లు పొంగి పొర్లాయి. వరంగల్ రైల్వే స్టేషన్ సమీపంలోని అండర్ బ్రిడ్జి వద్ద వరద నీటిలో ఆర్టీసీ బస్సు చిక్కుకుంది. ఇంతేజార్ గంజ్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ షుకూర్ సిబ్బందితో కలిసి వెళ్లి తాళ్ల సహాయంతో ప్రయా ణికులను సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. హనుమకొండ నగరంలో అశోక్ నగర్ కాలనీలో చెట్టు కూలి విద్యుత్ లైన్ పై పడింది. నీతో విద్యుత్ సరఫరాకు అంతరా యం కలిగింది. ప్రమాద ఘటన సమయంలో ఎవరూ లేకపోవడంతో ఊపిరి పించుకున్నారు.
ప్రభుత్వ చర్యలు శూన్యం
గత కొన్నేళ్లుగా కొద్దిపాటి వర్షానికి కూడా వరంగల్ నగరం వరద నీటిలో చిక్కుకొని జనజీవనం అస్తవ్యస్తంగా మారుతు న్నప్పటికీ, వరద తిప్పలు తొలగించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని ప్రజ లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అనేకచోట్ల కబ్జాకు గురైన నాళాలను పునరు ద్ధరించడం లేదని, వరద నీరు ఎక్కడికక్కడే నిలిచిపోవడం వల్ల ఇబ్బంది కలుగుతుందని ప్రజలు పేర్కొంటున్నారు.
అంబేద్కర్ భవన్ వద్ద వర్షం నేను నిలవకుండా చర్యలు తీసుకోవాలని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అధికారులను ఆదేశించినప్పటికీ ఇప్పటివరకు పట్టించుకోవడంలేదని ఆ ప్రాంతవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో చిన్నపాటి వర్షం కురిసిన అంబేద్కర్ భవన ప్రాంగణం పూర్తిగా నీటితో నిండి పోతుందని చెబుతున్నారు. కొద్దిపాటి వర్షానికి కూడా కాలు బయట పెట్టలేని పరిస్థితి ఎదురవుతోందన్నారు.