08-09-2025 09:36:00 AM
సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లాలోని ఐడీఏ బొల్లారం(IDA Bollaram) కేబీఆర్ కాలనీలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురైయ్యాడు. ఒంగోలుకు చెందిన మేస్త్రీ జయప్రకాష్ ను గుర్తు తెలియని దుండగులు హత్య చేశారు. దుండగులు జయప్రకాష్ ని మరోచోట హత్య చేసి అతని మృతదేహాన్ని ఇంటిముందు పడేశారు. బొల్లారం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.