18 June, 2026 | 1:42 AM

నేడే ఎస్‌ఐఆర్-పై అవగాహనకు 2కె రన్

18-06-2026 12:00 AM

హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి

హనుమకొండ, జూన్ 17 (విజయక్రాంతి): ఓటరు జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమంలో భాగంగా ఓటర్లలో అవగాహన పెంచేందుకు గురువారం ఉదయం 7:00 గంటలకు 2కె రన్  నిర్వహిస్తున్నట్లు హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.

ఓటర్లలో అవగాహన కోసం చేపట్టే ఈ కార్యక్రమాన్ని హనుమకొండ అదాలత్ సర్కిల్ లోని జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయం వద్ద నుండి జిల్లా కలెక్టరేట్ వరకు 2కె రన్ సాగుతుందని పేర్కొన్నారు. వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు సమన్వయంతో నిర్వహించే ఈ కార్యక్రమంలో  అధికారులు, విద్యార్థులు, యువత అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని తెలిపారు.