మంచినీటి సమస్యను పరిష్కరించండి
ఎమ్మెల్యే ముఠా గోపాల్
జలమండలి అధికారులకు ఫిర్యాదు చేసినా
పట్టించుకోవడం లేదని స్థానికుల ఆగ్రహం
ముషీరాబాద్, జూన్ 17 (విజయక్రాంతి): ముషీరాబాద్‌లో ప్రెషర్ నీటి సమస్య, డ్రైనేజీ సమస్యలను వెంటనే పరిష్కరించి ప్రజలకు సరిపడినన్ని నీటిని సరఫరా చేయాలని స్థానిక ఎమ్మెల్యే ముఠా గోపాల్, జలమండలి అధికారులను డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం ముషీరాబాద్ లోని ఆశీర్వాద్ అపార్టుమెంట్ వీధి, బాప్టిస్ట్ చర్చి వీధులలో నెలకొన్న స్థానిక సమస్యల పరిష్కారానికి బీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు తలారి శ్రీకాంత్ ముదిరాజ్ విజ్ఞప్తి మేరకు ఎమ్మెల్యే ముఠా గోపాల్, జలమండలి డీజీఎం విష్ణువర్థన్ రావు, సెక్షన్ మేనేజర్ శివ సాయిలతో కలిసి ఎమ్మెల్యే పర్యటించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నీటి సరఫరాలో సమయపాలన పాటించకపోవడం, అరగంట పాటు కూడా నీటి సరఫరా చేయక పోవడం వలన ప్రజలు మంచినీటి కోసం తీవ్ర అవస్థలు పడుతున్నారని పేర్కొన్నారు. గత 20 రోజులుగా నీటి సరఫరా లేకపోవడం వలన ప్రజలు అల్లాడుతున్నారని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. డ్రైనేజీ మురుగునీటి సమస్యలతో ప్రజల రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడడంతో పాటు కలుషిత నీటి సరఫరా జరుగుతున్నదని, ఈ సమస్యను వెంటనే పరిష్కరిం చాలని కోరారు.
నీటి సమస్య పరిష్కారానికి రెండుసార్లు ప్రతిపాధనలు రూపొందించినా నిధులు విడుదల చేయకుండా జలమండలి ఉన్నతాధికారులు నిర్లక్ష్య దోరనితో వ్యవహరితున్నారని ఆరోపించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సమసక్షంలో స్థానిక ప్రజలు తాము ఎదుర్కొంటున్న సమస్యలపై జలమండలి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ ముదిరాజ్ ఎమ్మెల్యే ముఠా గోపాల్, జలమండలి అధికారులకు సన్మానం చేశారు.
ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ యువ నాయకుడు ముఠా జైసింహ, ముషీరాబాద్ డివిజన్ బీఆర్‌ఎస్ అధ్యక్షుడు శ్రీధర్ రెడ్డి, మీడియా సెల్ ఇన్చార్జి ముచ్చకుర్తి ప్రభాకర్, డివిజన్ మాజీ అధ్యక్షుడు బిక్షపతి యాదవ్, పార్టీ సీనియర్ నాయకులు ఆకారం శ్రీనివాస్, పూస గోరఖ్ నాధ్, డి.రాజు, రవియాదవ్, నాగులు యాదవ్, నేత శ్రీనివాస్, సంతోష్, బల్వంత్ తదితరులు పాల్గొన్నారు.






