14 April, 2026 | 1:25 PM

Breaking News

గొప్ప అభ్యుదయ వాది డాక్టర్ బీఆర్ అంబేద్కర్   •   అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే కోరం కనకయ్య   •   సమాజంలో ప్రతి ఒక్కరు రక్తదానం చేసేందుకు ముందుకు రావాలి   •   అంబేడ్కర్‌కు నివాళులర్పించిన మధిర మార్కెట్ కమిటీ చైర్మన్   •   తల్లాడ పట్టణంలో అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు   •   సోనాల మండలంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు   •   అంబేద్కర్ అసలు వారసులం మేమే   •   సామాజిక న్యాయం, సమానత్వం కోసమే అంబేద్కర్ ఆరాటం   •   కూసుమంచి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అంబేద్కర్ జయంతి వేడుకలు   •   కేంద్ర నిబంధనలు పాటిస్తే... దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేస్తారా?   •  

సర్ సీవీ రామన్ టాలెంట్ టెస్ట్

05-02-2026 01:48 AM

జాతీయ, రాష్ట్ర స్థాయిలో నిర్వహణ

50 వేల మంది విద్యార్థుల హాజరు

హైదరాబాద్, ఫిబ్రవరి 4 (విజయక్రాంతి): సుచిరిండియా ఫౌండేషన్ 33వ సర్ సీవీ రామన్ టాలెంట్ సెర్చ్ పరీక్షను జాతీయ, రాష్ట్ర స్థాయిలో వివిధ పాఠశాలల్లో సుచిర్‌ఇండియా ఫౌండేషన్ అధినేత లయన్ కిరణ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. 500 పైగా పాఠశాలల నుంచి 50వేల మం ది విద్యార్థులు పాల్గొన్నారు. 20 మందికి గోల్డ్ మెడల్స్, 20 మందికి నేషనల్ ర్యాంక్స్, 20 మందికి రాష్ట్రస్థాయి మెడల్స్, 450 మందికి జిల్లా స్థాయి ర్యాంక్స్ వచ్చాయి. ఈ అవార్డులు బుధవారం విద్యార్థులకు రవీంద్రభారతిలో  ప్రదానం చేశారు.

కార్యక్రమం లో ఏపీ ఎమ్మెల్యే ఘంటా శ్రీనివాసరావు, చింతమనేని ప్రభాకర్, సినీనటులు శ్రీకాంత్, శివాజీ రాజా, సూచిరిండియా ఫౌండేషన్ నిర్వహకులు లయన్ కిరణ్ చేతుల మీదుగా అందజేశారు. సినీనటుడు శ్రీకాంత్ మాట్లాడుతూ.. ఈ కార్యక్రమంలో పాల్గొనడం చా లా సంతోషంగా ఉందన్నారు. ఘంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ.. 33 సంవత్సరా లుగా ఈ మహాకార్యాన్ని లయన్ కిరణ్ నిర్వహించడం సంతోషంగా ఉన్నదన్నారు.