22 June, 2026 | 2:37 PM

Breaking News

దుందుభి వాగుపై హై లెవెల్ బ్రిడ్జికి మంత్రి సీతక్క శంకుస్థాపన   •   డీటీవో వెంకన్న మృతి ఘటనపై విచారణకు ఆదేశం   •   బ్రిటన్‌ ప్రధాని కీర్‌ స్టార్మర్‌ రాజీనామా.. పదేళ్లలో ఆరుగురు!   •   ఉప సర్పంచుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా..   •   శిక్షణా తరగతులు కార్మిక చైతన్యానికి దోహదపడాలి   •   ​ ప్రజా పాలన సినిమా కాదు.. ప్రతిపక్ష పాత్ర సరిగ్గా పోషించండి: మంత్రి సీతక్క   •   డీటీవో వెంకన్న మృతి పట్ల రేవంత్ రెడ్డి దిగ్బ్రాంతి   •   రాజ్‌నాథ్‌ సింగ్‌తో CM రేవంత్ రెడ్డి భేటీ.. కీలక అంశాలపై చర్చ!   •   తరగతి గదుల్లోకి ఉపాధ్యాయుల వాహనాలు.!   •   ఎం.జి.ఎన్.ఆర్.ఈ.జి.ఎస్ నిధులతో రూ.27 లక్షల పనులకు శంకుస్థాపన   •  

అడ్వకేట్ హత్య.. న్యాయవ్యవస్థపై దాడి

05-02-2026 01:48 AM

పీసీసీ లీగల్ సెల్ ఆగ్రహం 

హైదరాబాద్, ఫిబ్రవరి 4 (విజయక్రాంతి): చేవెళ్లలో న్యాయవాది స్వప్న దారుణ హత్యను పీసీసీ లీగల్ సెల్ కన్వీనర్ సత్యనారాయణ గుండ్లపల్లి తీవ్రంగా ఖండించారు. బుధవారం ఆయన రంగారెడ్డి జిల్లా కోర్ట్ ఆవరణలో మాట్లాడుతూ.. స్వప్న హత్య కేవలం ఒక వ్యక్తిపై జరిగిన దాడి కాదని, అది న్యాయ వ్యవస్థపై జరిగిన దాడి అని పేర్కొన్నారు. ప్రజల పక్షాన కోర్టుల్లో వాదించే న్యాయవాదులకే రక్షణ లేకపోవడం దురదృష్టకరమని, ఒక మహిళా అడ్వకేట్‌ను హత్య చేయటం  సమాజం విఫలమైందనడానికి నిదర్శనమని మండిపడ్డారు.

రాష్ట్రంలో న్యాయవాదులపై దాడులు పెరిగిపోతున్నాయని, ప్రభుత్వం తక్షణమే  అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్’ను  తీసుకురావాలని, తద్వారా న్యాయవాదులకు వృత్తిపరమైన భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. స్వప్న హత్య కేసును ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు అప్పగించి, నిందితులకు ఉరిశిక్ష పడేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా పీసీసీ లీగల్ సెల్ వైస్ చైర్మన్ దేవులపల్లి సంతోష్ కుమార్, కన్వీనర్ పీఆర్‌వీ ప్రసాద్, సభ్యులు ఎం. సత్యనారాయణ, ఎస్. లక్ష్మయ్య, రమ్య, జీవన్, ఉమేష్ తదితరులు పాల్గొన్నారు.