28 August, 2026 | 1:56 PM

Breaking News

జర్నలిస్టులకు రాఖీ కట్టి.. హెల్మెట్లు అందించిన మాజీ మంత్రి సత్యవతి రాథోడ్   •   రక్షాబంధన్‌ పండుగ.. మన బంధాలకు ప్రతీక: ఎమ్మెల్యే పాయల్‌ శంకర్   •   బసవరాజు శ్రీనివాస్ పై నీలాప నిందలు మానేయండి   •   సీఐ అత్యుత్సాహం.. ఆందోళనకారులపై దాడి   •   శిశుమందిర్ విద్యార్థుల సౌభ్రాతృత్వ సందేశం   •   ముత్తారం మాజీ జడ్పీటీసీని పరామర్శించిన కాంగ్రెస్ నాయకులు   •   కిక్కిరిసిన బస్సులు.. కిటకిటలాడుతున్న బస్టాండ్లు   •   మాజీ మంత్రి కోట్నాక భీంరావు వర్ధంతిని విజయవంతం చేయాలి   •   జర్నలిస్టులకు రాఖీ కట్టిన ఎస్సై గుగులోత్ శ్రీదేవి   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం మహాధర్నా   •  

ఎస్‌ఐఆర్ డిజిటైజేషన్ గడువులోపు పూర్తి చేయాలి

11-07-2026 02:42 PM

జిల్లా అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్

మహబూబ్ నగర్ (విజయక్రాంతి) : ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంలో భాగంగా జరుగుతున్న ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ (ఆన్‌లైన్) ప్రక్రియను ఈ నెల 20వ తేదీలోపు పూర్తి చేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ అధికారులను ఆదేశించారు.శనివారం  కొత్తకోట, మదనాపురం, అడ్డాకల్, మూసాపేట్ మండలాల్లోని పోలింగ్ కేంద్రాలను సందర్శించి ఆకస్మికంగా తనిఖీ చేశారు.

కొత్తకోట, మదనాపురం మండలాలలోనీ గోవిందహళ్లి, దంతనూరు గ్రామాలు, అడ్డాకల్ మండలంలోని కందూరు గ్రామం, మూసాపేట్ మండలంలోని కొమ్మిరెడ్డిపల్లి గ్రామాల్లో కొనసాగుతున్న ఎన్యూమరేషన్ ఫారాల డిజిటైజేషన్  నమోదు ప్రక్రియను స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన అధికారులకు పలు సూచనలు చేశారు. స్వీకరించిన అన్ని ఎన్యూమరేషన్ ఫారాలను గడువులోపు తప్పనిసరిగా ఆన్‌లైన్లో అప్లోడ్ చేసి డిజిటైజేషన్ ప్రక్రియను  ఎటువంటి జాప్యం లేకుండా పూర్తి చేయాలని ఆయన సూచించారు. ఇప్పటికీ ఎన్యూమరేషన్ ఫారాలు సమర్పించని ఓటర్లు వెంటనే తమ సంబంధిత బి.ఎల్.ఓ లని సంప్రదించి ఫారాలను సమర్పించాలని ఆయన కోరారు. ఫారాలు సమర్పించని వారి పేర్లు ఓటరు జాబితా నుంచి తొలగించబడే అవకాశం ఉన్నందున , అర్హత కలిగిన ప్రతి ఓటరు తప్పనిసరిగా ఎన్యూమరేషన్ ఫారాన్ని బి.ఎల్.ఓ లకు సమర్పించాలని సూచించారు.తనిఖీ లో భాగంగా ఆయా మండలాల తహసీల్దార్లు, బిఎల్‌ఓ సూపర్వైజర్లు, బిఎల్‌ఓలు, గ్రామ సర్పంచులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.