11 July, 2026 | 3:30 PM

ఐబీ చౌరస్తా సమీపంలో మరుగుదొడ్లు నిర్మించాలి

11-07-2026 02:43 PM

స్వధర్మ ఫౌండేషన్ వ్యవస్థాపకులు కుడెల్లి అశోక్ వినతి..

ఉట్నూర్, జూలై 11 ( విజయక్రాంతి ): ఉట్నూర్ డివిజన్ కేంద్రంలోని ఐబీ చౌరస్తా సమీపంలో మరుగుదొడ్లు నిర్మించాలని స్వధర్మ ఫౌండేషన్ వ్యవస్థాపకులు కుడెల్లి అశోక్ కోరారు. ఈ మేరకు అయన ఐటీడీఏ పీవో మంద మకరందం కు వినతి పత్రం శనివారం అందజేశారు. ఐబీ చౌరస్తాలో ఆర్టీసీ బస్ స్టాప్ ఉండటంతో పాటు సమీపంలో విద్యా సంస్థలు దుకాణాలు హోటల్స్ ఉండటం వల్ల మహిళలు యువతులు విద్యార్ధినులు మల మూత్ర విసర్జన కోసం తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని పేర్కొన్నారు . ప్రభుత్వ పరంగా వెంటనే మరుగుదొడ్లు నిర్మాణం చేపట్టేలా చర్యలు తీసుకోవాలని అశోక్ పీవో కు విజ్ఞప్తి చేసారు..