ఘనంగా బండి సంజయ్ జన్మదిన వేడుకలు
11-07-2026 03:19 PM
డిప్యూటీ మేయర్ ఆద్వర్యంలో సామాజిక సేవా కార్యక్రమాలు
ముకరంపుర,(విజయక్రాంతి): కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ జన్మదిన వేడుకలు కరీంనగర్ లో ఘనంగా జరిగాయి. శనివారం రోజు బీజేపి రాష్ట్ర అధికార ప్రతినిధి, నగర డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు పలువరు బీజేపి నాయకులు కార్యకర్తలతో కలిసి జన్మదిన వేడుకలను వైభవంగా నిర్వహించారు. తన క్యాంపు కార్యాలయంలో కేక్ కట్ చేసి, అనంతరం డివిజన్ ప్రజలకు మొక్కలను పంపిణీ చేశారు. అనంతరం భగత్ నగర్ లోని పోలీస్ క్వార్టర్స్ ప్రభుత్వ పాఠశాలలో చదివే 60 మంది విద్యార్థిని విద్యార్థులకు ఉచితంగా స్కూల్ బ్యాగులు, నోట్ బుక్స్, పెన్నులు, ఇతర స్టేషనరీ వస్తువులను తన చేతుల మీదుగా పంపిణీ చేశారు.






