ఎస్‌ఐఆర్ మ్యాపింగ్ త్వరగా పూర్తి చేయాలి
సబ్ కలెక్టర్ ఉమా హారతి
నాగల్గిద్ద, జూన్ 3: నాగల్గిద్ద మండలంలో నిర్వహించిన మండల స్థాయి సమావేశంలో నారాయణఖేడ్ సబ్ కలెక్టర్ ఉమా హారతి పాల్గొని ఎస్‌ఐఆర్ పోర్టల్ మ్యాపింగ్ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈనెల 4 నుంచి ప్రారంభం కానున్న ప్రత్యేక గ్రామ సభలను విజయవంతంగా నిర్వహించాలని సూచించారు. ఇందుకోసం మండలంలోని అధికారులను ఐదు ప్రత్యేక బృందాలుగా విభజించి ప్రతి గ్రామంలో పాల్గొనే విధంగా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.
గ్రామ స్థాయిలో ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన కల్పించి, గ్రామ సభల్లో ప్రజల సమస్యలను తెలుసుకొని పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ మహేశ్వరరావు, ఎమ్మార్వో సంగ్రామ్ రెడ్డి, ఎస్త్స్ర రామకృష్ణ, మండల వ్యవసాయ అధికారి ప్రవీణ్ చారి, ఏపీఎం నర్సింలు, మండల ఐసిడిఎస్ సూపర్వైజర్ ప్రశాంతి, ఎంపీ ఓ ఇందిరమ్మ, మండల పంచాయతీ కార్యదర్శులు బిఎల్‌ఓ అధికారులు ఏఈఓ లు తదితర మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.






