అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే
నారాయణఖేడ్, జూన్ 3: నారాయణఖే డ్ నియోజకవర్గ పరిధిలోని పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే డాక్టర్ పి.సంజీవరెడ్డి బుధవారం శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా బోరంచ గ్రామంలో నూతనంగా నిర్మించిన అంగన్వాడి కేంద్ర భవనాన్ని ఆయన ప్రారంభించారు. బోరంచ గ్రామం నుండి నారాయణఖేడ్ పట్టణానికి సరఫరా అవుతున్నతాగునీటి శుద్ధికి సంబంధించి రూ .95 లక్షలతో చేపట్టనున్న ఎంఎల్డి నీటి శుద్ధి కేంద్రం పనులకు శంకుస్థాపన చేశారు.
నారాయణఖేడ్ పట్టణంలోని జూకల్ శివారులో గల అర్బన్ పార్క్ ను సందర్శించారు. అంతర్జాతీయ సైకిల్ దినోత్సవం పురస్కరించుకొని ఆయన స్థానికులతో కలిసి అర్బన్ పార్కుల్లో సైకిల్ తొక్కుతూ పనులను పర్యవేక్షించారు. అర్బన్ పార్కులో కొనసాగుతున్న అభివృద్ధి పనులను స్థానిక ఫారెస్ట్ అధికారులతో అడిగి తెలుసుకుని పలు సూచనలను సలహాలను అందించారు. నారాయణఖేడ్ మండల పరిధిలోని పలుగు తాండాలో భవాని మాత ఆలయ ఉత్సవాలు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ నాయకులు భోజిరెడ్డి, లోకేష్ రెడ్డి, నారాయణఖేడ్ పట్టణ మున్సిపల్ కౌన్సిలర్లు, ఆయా గ్రామాల సర్పంచులు, మాజీ ఎంపిటిసిలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.






