17 July, 2026 | 12:40 AM

‘సర్’ వేగవంతం చేయాలి

17-07-2026 12:00 AM

కలెక్టర్ మను చౌదరి

మేడ్చల్, జూలై 16(విజయ క్రాంతి): ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియలో బిఎల్వోలు నిర్వహిస్తున్న ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ, స్వీకరణ వేగవంతం చేయాలని మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టర్ మను చౌదరి  సూచించారు. గురువారం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని శామీర్ పేట గ్రామంలో  జరుగుతున్న సర్ ప్రక్రియను జిల్లా కలెక్టర్ మను చౌదరి పర్యవేక్షించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మొత్తం ఎన్ని  ఎన్యుమరేషన్ ఫారాలు కేటాయించారు, ఇప్పటి వరకు ఎన్ని ఫారాలు అందించారు, తిరిగి ఎన్ని ఫారాలు తీసుకున్నారు అని బిఎల్ ఓలను నేరుగా అడిగి తెలుసుకున్నారు. తీసుకున్న ఫారాల డిజిటలైజ్ ఏవిధంగా చేస్తున్నారని ప్రత్యక్షంగా పరిశీలించారు. ఫారాలు పూరించడంలో ఓటర్లకు అవసరమైన మేర సహాయం అందించాలని బిఎల్‌ఓలకు కలెక్టర్ సూచించారు.ఈ కార్యక్రమంలో శామీర్ పేట్ తహాసీల్దారు సిహెచ్.శ్రీనివాస్, బిఎల్‌ఓలు తదితరులు పాల్గొన్నారు.