17 July, 2026 | 12:47 AM

డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యం

17-07-2026 12:00 AM

పోచారం ఇన్స్‌స్పెక్టర్ కనకయ్యగౌడ్

ఘట్కేసర్, జూలై 16 (విజయక్రాంతి) : యువత, విద్యార్థులు డ్రగ్స్ (మాదకద్రవ్యాలు) బారిన పడి తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని పోచారం ఐటీ కారిడార్ ఇన్ స్పెక్టర్ కనకయ్య గౌడ్ అన్నారు. గురువారం కొర్రెములలో స్థానిక యువత, విద్యార్థులు, ప్రజలను ఉద్దేశించి డ్రగ్స్ వాడకం వల్ల కలిగే అనర్థాలపై ఒక ప్రత్యేక అవగాహన సదస్సును నిర్వహించారు.

డ్రగ్స్, గంజాయి వంటి మత్తుపదార్థాలు నేరుగా మానవ మెదడు, కేంద్ర నాడీ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతాయని పోలీసులు వివరించారు. గ్రామాల్లో అనుమానాస్పద వ్యక్తులు తిరిగినా లేదా డ్రగ్స్, గంజాయి విక్రయాల సమాచారం తెలిసినా వెంటనే పోలీసులకు లేదా టోల్ ఫ్రీ నెంబర్లకు సమాచారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పోచారం ఐటీ కారిడార్ పోలీస్ అధికారులు, సిబ్బందితో పాటు నాయకులు, యువత పాల్గొన్నారు.