5 August, 2026 | 1:53 AM

‘సర్’ను సీరియస్‌గా తీసుకోవాలి

05-08-2026 12:45 AM

ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి

ఇబ్రహీంపట్నం, అగస్టు 4 (విజయక్రాంతి): సమగ్ర ఓటర్ల సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియను క్షేత్రస్థాయిలో అత్యంత సీరియస్గా తీసుకోవాలని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి ప్రజాప్రతినిధులు, నాయకులకు సూచించారు. తొర్రూర్ లోని క్యాంపు కార్యాలయంలో ’బీ’ బ్లాక్ (అబ్దుల్లాపూర్ మెట్, తుర్కయంజాల్, తొర్రూ ర్, పెద్దఅంబర్ పేట్, కుంట్లూర్) నాయకులు, బీఎల్‌ఏలు,సూపర్వైజర్లతో మంగళ వారం ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా పీసీసీ ప్రతినిధి చైతన్యతో కలిసి ఆయన పలు సూచనలు చేశారు.

ఎట్టి పరిస్థితుల్లోనూ పేదలు, బడుగు, బలహీన వర్గాల ఓట్లు తొలగించబడకుండా అప్రమత్తంగా ఉండాలి. ఓటర్లను కాపాడటంలో నిర్లక్ష్యం వహిస్తే ఎలాంటి హోదాలో ఉన్నవారికైనా అధిష్ఠానం చర్యలు తప్పవని హెచ్చరించారు.ఎన్యూమరేషన్ ఫారాలను డిజిటలైజ్ చేసేందుకు బూత్ లెవెల్ అధికారులకు అందించాలని, ప్రతీ ఓటరుతో సమన్వయం చేసుకుంటూ గడువులోగా ప్రక్రియను పూర్తి చేయాలని పిలుపునిచ్చారు.ఈ ప్రక్రియలో ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు బూత్ల వారీగా ఐక్యంగా పనిచేసి ఓటు హక్కును కాపాడాలని ఆయన దిశానిర్దేశం చేశారు.