12 June, 2026 | 7:10 PM

నిర్మల్ జిల్లాలో సర్ సద్వినియోగం

12-06-2026 05:58 PM

నిర్మల్,(విజయక్రాంతి): భారత ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు నిర్మల్ జిల్లాలో చేపట్టిన సర్ ప్రత్యేక సమగ్ర ఓటర్ల సవరణ లు ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకొని ఒకే ఓటు విధానాన్ని పొందాలని జిల్లా కలెక్టర్ భవిష్ మిశ్రా తెలిపారు. నిర్మల్ జిల్లాలో ఇప్పటికి బిఎల్ఓల సమక్షంలో అన్ని పోలింగ్ కేంద్రాల్లో సర్ విధానంపై ప్రజలకు అవగాహన కల్పించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఇప్పటికీ సర్వీస్ పూర్తయిందని మిగతా షెడ్యూలు త్వరలో అమలవుతుందని తెలిపారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటుకు ఎంతో ప్రాధాన్యత ఉందని అటువంటి ఓటు హక్కు పొందే బాధ్యత ప్రతి పౌరుడిని గుర్తు చేశారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని సహకరించాలని కోరారు.