12 June, 2026 | 7:14 PM

ఎరువుల పంపిణీలో పారదర్శకత

12-06-2026 05:54 PM

నిర్మల్,( విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో ఎరువుల విక్రయాలు పారదర్శకత అమలు చేస్తున్నట్టు జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా తెలిపారు. నిర్మల్ జిల్లాలో రైతుల సాగుకు అనుకూలంగా రసాయన ఎరువులు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. నిర్మల్ జిల్లాలో 10734 మెట్రిక్ టన్నుల అందుబాటులో ఉందని ఇప్పటికే 7000 మంది రైతులు బుకింగ్ చేసుకున్నారని తెలిపారు. కాంప్లెక్స్ ఎరువులు కూడా కొడత లేకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రతి ఎరువుల దుకాణం వద్ద ధరల పట్టిక స్టాక్ వివరాలు పోస్టర్లు ఏర్పాటు చేస్తామన్నారు. రైతులకు ఎరువులను కృత్రిమంగా కోరుతా సృష్టించిన అధిక ధరలకు విక్రయించిన ఫిర్యాదులు వస్తే వారి లైసెన్సులను రద్దు చేస్తామని తెలిపారు. ఎరువుల పంపిణీ పై జిల్లాలో టోల్ ఫ్రీ నెంబర్ అందుబాటులో ఉంటుందని దాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అంజి ప్రసాద్ అధికారులు పాల్గొన్నారు