25 June, 2026 | 12:33 PM

ఎక్వాయిపల్లిలో ‘సర్ ’ ఓటర్ పరిశీలన కార్యక్రమం ప్రారంభం

25-06-2026 11:22 AM

​కడ్తాల్, జూన్ 25(విజయక్రాంతి): గ్రామంలో ఓటర్ల జాబితా పరిశీలన (సర్ ) కార్యక్రమం అధికారికంగా ప్రారంభమైంది. స్థానిక సర్పంచ్ పాలకుర్ల కరుణాకర్ గౌడ్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటర్ల నమోదు, తొలగింపు ప్రక్రియల్లో ఎలాంటి తప్పులకూ తావు లేకుండా, అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని అధికారులకు సూచించారు. ​గ్రామ పంచాయతీ, అంగన్‌వాడీ, రెవెన్యూ శాఖలు పరస్పరం సమన్వయం (కోఆర్డినేషన్) చేసుకుంటూ ముందుకు సాగాలని, బూత్ లెవెల్ ఏజెంట్ల సహకారంతో ఈ ‘సర్ ’ ప్రక్రియను విజయవంతం చేయాలని సర్పంచ్ కోరారు. ఈ కార్యక్రమంలో జీపీఓ గణేష్, పంచాయతీ కార్యదర్శి నిరంజన్, అంగన్‌వాడీ సిబ్బంది (సుగుణ, లీలావతి, లక్ష్మి), అలాగే స్థానిక నాయకులు చోటే, మహేష్, రవి, ప్రకాష్, మధు, రాజు తదితరులు పాల్గొన్నారు.