calender_icon.png 30 January, 2026 | 3:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్ కక్షపూరిత దోరణికి నిదర్శనం సిట్ నోటీసులు

30-01-2026 01:27:34 AM

ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్

హనుమకొండ,జనవరి 29 (విజయ క్రాంతి): తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కి సిట్ నోటీసుల నేపథ్యంలో దాస్యం వినయ్ భాస్కర్ కార్యకర్తలతో కలిసి గురువారం సాయంత్రం బాలసముద్రం లోని రహదారి పై కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మను దహనం చేశారు. అనంతరం కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా దాస్యం వినయ్ భాస్కర్  మాట్లాడుతూ కేసీఆర్ ప్రతిష్టను దిగజార్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తోందని,తెలంగాణను కొట్లాడి సాధించిన నేతపై కుట్రపూరితంగా కాంగ్రెస్ వ్యవహరిస్తోందని విమర్శించారు.14 ఏండ్ల సుదీర్ఘ పోరాటం, 10 ఏండ్ల పాలనలో కేసీఆర్  తెలంగాణ ను దేశంలోనే అగ్రభాగన నిలిపిన ఘనత కేసీఆర్ కే దక్కుతుందన్నారు.

ప్రజల్లో కేసీఆర్  ని పలచన చేసేందుకే సంకుచిత మనసుతో, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నోటీసులు, కమిషన్లు , సిట్ల పేరిట వేధింపులకు గురి చేస్తోందన్నారు.ఎన్ని కేసులు, నోటీసులు, సిట్లు, ఎన్ని వేసినా ప్రజల తరపున కేసీఆర్  సైన్యంమైన బిఆర్‌ఎస్ కార్యకర్తలు, గులాబీ సైనికుడిగా తాను ముందుండి పో రాడుతామన్నారు. ఈ కార్యక్రమం లో కార్పొరేటర్ సోదా కిరణ్, మాజీ కార్పొరేటర్ జోరిక రమేష్, నాయకులు నరెడ్ల శ్రీధర్,పులి రజినీకాంత్, వినయ్, ఉదిత్, వెంకన్న, రఘు, రాజేష్, రా జు, వీపీ రెడ్డి, శరత్ చంద్ర, రామ్మూర్తి, చందర్, మహమూద్, ఇమ్మడి రాజు, రాజ్కుమార్, న యీంజుబేర్, స్నేహిత్, రాకేష్ యాదవ్, షఫీ, వీరస్వామి, వినీల్ రావు, తదితరులు పాల్గొన్నారు.