calender_icon.png 30 January, 2026 | 6:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పరకాల మున్సిపల్ ఎన్నికల ఫామ్ -ఏ కలెక్టర్‌కు అందజేత

30-01-2026 01:26:13 AM

హనుమకొండ టౌన్, జనవరి 29 (విజయక్రాంతి): పరకాల మున్సిపాలిటీ వార్డుల సభ్యుల ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తరఫున ఫామ్- బీ నోటీసులు జారీ చేసే అధికార ప్రతినిధిగా హనుమకొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఇనగాల వెంకట్రాంరెడ్డినీ నియమించి నట్లు, జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి కి అధికారికంగా సమాచారం అందజేశారు. ఈ సందర్భంగా ఇనగాల వెంకట్రాంరెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఈ.వి శ్రీనివాస్ రావు లు జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి స్నేహ శబరిస్‌ని కలిసి సంబంధిత ఫామ్- ఏ  వివరాలను అందజేశారు . ఎన్నికల కమిషన్ నిబంధనలకు అనుగుణంగా పారదర్శకంగా ఎన్నికల ప్రక్రియను నిర్వహిస్తామని కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలిపారు.