calender_icon.png 30 January, 2026 | 3:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాధిత కుటుంబానికి ఎల్‌ఓసీ అందజేత

30-01-2026 01:29:20 AM

జనగామ, జనవరి 29 (విజయక్రాంతి): జనగామ మండలం శా మీర్ పేట గ్రామానికి  చెందిన చం దగొండ రాంరెడ్డి మండల మాజీ పి ఏ సి ఎస్ చైర్మెన్ కి ప్రొస్టేట్ చికిత్స కోసం పెద్ద మొత్తంలో డబ్బులు అవసరం కాగా, ఇట్టి విషయాన్ని స్థానిక శామీర్ పేట గ్రామ సర్పంచ్ గనిపాక వనిత మహేందర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు నాగపురి కిరణ్ కుమార్ గౌడ్ దృష్టికి తీసుక రాగా వెంటనే స్పందించి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి కి తెలియజేయగా వారు వెంటనే స్పందించి. ఎల్వోసి, సి ఎం ఆర్‌ఎఫ్ ద్వారా 1,75,000  మంజూరు చేయించారు. ఇట్టి మంజూరు పత్రాన్ని బాధిత కుటుంబసభ్యులకు అందజేశారు.ఈ సందర్భంగా  బాధిత కుటుంబసభ్యులు మాట్లాడుతూ.. ఎల్ వో సి మంజూరు చేయించిన ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి కి మరియు నాగపురి కిరణ్ కుమార్ గౌడ్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వారి కుమారులు నర్సింహ రెడ్డి, సత్తి రెడ్డి మరియు సీనియర్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.