27 May, 2026 | 2:17 AM

సెప్టిక్ ట్యాంక్‌లోకి దిగి ఆరుగురి మృతి

27-05-2026 01:21 AM

ఒడిశాలోని కర్లాంకుంటలో ఘటన

భువనేశ్వర్, మే 26: నిర్మాణంలో ఉన్న సెప్టిక్ ట్యాంక్‌లో దిగి ఊపిరాడక ప్రమాదవశాత్తూ ఆరుగురు మృతి చెందిన ఘటన మం గళవారం ఒడిశాలోని కళహండి జిల్లా ఎం. రాపూర్ సమితిలోని గౌడ కర్లాంకుంట గ్రామంలో చోటు చేసుకుంది. సెప్టిక్ ట్యాంక్ సెంట్రింగ్ తీయడానికి దిగిన మేస్త్రీ ప్రమాదానికి గురయ్యారు. మేస్త్రీని కాపాడేందుకు దిగిన ఐదుగురు ఊపిరాడక చనిపోయారు. మరో కార్మికుడు అపస్మారకస్థితిలోకి చేరుకొని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

గ్రామస్థులు, రెస్క్యూ బృందాలు వెంటనే సహాయక చర్యలు చేపట్టి ట్యాంక్‌లోని వా రిని బయటికి తీసి ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆరుగురు మృతి చెందినట్లు వైద్యు లు ధృవీకరించారు. తీవ్ర అస్వస్థతకు గురైన మరో వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. మృతుల్లో ముగ్గురు మేస్త్రీలు, కార్మి కుడు ఇంటి యాజమాని, అతని కుమారు డు ఉన్నారు. ఘటనపై ఎం. రాంపూర్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.