1 July, 2026 | 10:08 PM

Breaking News

ప్రజల పన్నులతో నిర్మించిన 'మహాప్రస్థానం'పై..   •   లయన్స్ క్లబ్ బాన్సువాడ నూతన అధ్యక్షుడిగా పాత బాలకృష్ణ   •   ఓదెల మల్లన్న ఆలయంలో భక్తులపై తేనెటీగల దాడి   •   రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలలోని ఆలయాలకు ఉత్సవాలు నిర్వహిస్తాం   •   ఘనంగా ఎల్‌హెచ్‌పీఎస్ ఆవిర్భావ దినోత్సవం వేడుకల్లో పాల్గొన్న గిరిజన నాయకులు   •   విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలి   •   ఆలయాలు మానసిక ప్రశాంతతకు నిలయాలు   •   సందీప్ నగర్ కాలనీ సమస్యలపై కమిషనర్ స్పందన   •   పేద కుటుంబాల కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తోంది   •   ఒక్కరి ఓటు హక్కు కూడా మిస్ కావొద్దు: ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు   •  

నేడు 6 ఎస్టీపీలు, 19 రిజర్వాయర్లు ప్రారంభం

03-12-2024 02:53 AM

వర్చువల్‌గా ప్రారంభించినున్న సీఎం

హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 2(విజయక్రాంతి): జలమండలి పరిధిలోని పలు ప్రాజెక్టులను సీఎం రే వంత్‌రెడ్డి మంగళవారం మధ్యాహ్నం వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. అలాగే పనులకూ సీఎం శంకుస్థాపన చేస్తారు. దాదాపు రూ.666.72 కోట్ల తో నాగోల్, ఫతేనగర్, మీరాలం, ఖా జాకుంట, మియాపూర్, సఫీల్‌గూడలో చేపట్టిన ఎస్టీపీలు(మురుగుశుద్ధి కేంద్రాలు), వివిధ ప్రాంతాల్లో రూ.711.39 కోట్లతో చేపట్టిన 19 రిజర్వాయర్లను ఐమాక్స్ థియేటర్, భారీ అంబేద్కర్ విగ్రహం మధ్య ఉన్న గ్రౌండ్ నుంచి వర్చువల్‌గా ప్రారంభిస్తారు. చాంద్రయణగుట్ట నియోజకవ ర్గంలో రూ.301 కోట్లతో చేపట్టబోయే సీవరేజ్ అండర్ డ్రైనేజీ, పాత పైప్‌లైన్ పునరుద్ధరణ పనులకు శంకుస్థాపన చేస్తారు.